Ys Sharmila-Congress: బలపడుతున్న షర్మిల-కాంగ్రెస్ బంధం, థ్యాంక్యూ రాహుల్ సర్ ట్వీట్‌పై చర్చ

Ys Sharmila-Congress: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా విన్పిస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ వ్యవహారంలో మొదలైన చర్చ ఆమె తాజా ట్వీట్‌తో పీక్స్‌కు చేరుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 8, 2023, 07:06 PM IST
Ys Sharmila-Congress: బలపడుతున్న షర్మిల-కాంగ్రెస్ బంధం, థ్యాంక్యూ రాహుల్ సర్ ట్వీట్‌పై చర్చ

Ys Sharmila-Congress: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై స్పష్టంగా కన్పిస్తోంది. ఓ వైపు కాంగ్రెస్ నేతల ఘర్ వాపసీ మరోవైపు వైఎస్సార్టీపీ విలీన వార్తలు జోరందుకున్నాయి. వైఎస్సార్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ట్వీట్‌కు షర్మిల ఇచ్చిన సమాధానం సరికొత్త చర్చకు దారితీస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు తెలంగాణ బాధ్యతలు కూడా అప్పగించడంతో అక్కడి రాజకీయాల్లో మార్పు కన్పిస్తోంది. కీలకనేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం కీలక పరిణామం. మరోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..డీకే శివకుమార్‌ను అభినందించడంతో పరిణామాలు మారడం ప్రారంభించాయి. వైఎస్ కుటుంబసభ్యులతో డీకే శివకుమార్‌కు ఎప్పట్నించో మంచి సాన్నిహిత్య సంబంధాలున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఇప్పటికీ సాన్నిహిత్యం కొనసాగుతోంది. 

మరోవైపు గత కొద్దికాలంగా వైఎస్సార్టీపీని వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఒకవేళ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే షర్మిల తెలంగాణకు పరిమితమౌతుందా లేదా ఏపీ రాజకీయాల్లో ఆమెను చొప్పిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. విలీనం విషయంలో కాంగ్రెస్ నేతల నుంచి స్పందన వచ్చినా వైఎస్ షర్మిల మాత్రం స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనమౌతుందా లేదా అనేది పక్కనబెడితే తాజాగా రాహుల్ గాంధీ ట్వీట్ వర్సెస్ షర్మిల ట్వీట్ విలీన ప్రక్రియకు బలం చేకూర్చనుందనే వాదన విన్పిస్తోంది.

ఇవాళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి వైఎస్ఆర్‌కు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.  కాంగ్రెస్ సీనియర్ నేత , ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు..వైఎస్ఆర్ ఓ దార్శనిక నేత, అభివృద్ధిని కాంక్షించిన ప్రజానేతగా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్‌కు నివాళులు అర్పిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం ఇదే తొలిసారి. 

అయితే దీనికి సమాధానంగా వైఎస్ షర్మిల చేసిన ఎమోషనల్ ట్వీట్ ఇప్పుుడు చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్‌కు నివాళులు అర్పించడంపై వైఎస్ షర్మిల రాహుల్ గాంధీకు కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ ట్వీట్‌పై వైఎస్ షర్మిల ఉద్వేగంగా స్పందించారు. మీ నేతృత్వంలో దేశం ఉజ్వల భవిష్యత్ సాధిస్తుందనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమ్మేవారని షర్మిల తెలిపారు. ఆయనపై మీ ఆప్యాయతు ధన్యవాదాలు రాహుల్ జీ అంటూ ట్వీట్ చేశారు. 

అటు రాహుల్ గాంధీ ట్వీట్, ఇటు వైఎస్ షర్మిల ట్వీట్ చూస్తుంటే కచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో లేదా ఏపీ రాజకీయాల్లో మార్పు రావచ్చని తెలుస్తోంది. పార్టీని విలీనం చేస్తారా లేక కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా వైఎస్ షర్మిల వైఖరి ఇప్పుడు ప్రో కాంగ్రెస్ వైపుగా సాగుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Also read: PM Modi Tour In Warangal: విశ్వాస ఘాతకుడు కేసీఆర్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు: ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News