Telangana Vaccination: తెలంగాణలో 5 కోట్ల మార్క్​ దాటిన కరోనా వ్యాక్సినేషన్​!

Telangana Vaccination: తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాటికి వ్యాక్సినేషన్ మరో మైలురాయి దాటింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 09:57 PM IST
  • తెలంగాణలో వ్యాక్సినేషన్ జోరు
  • 5 కోట్ల మార్క్ దాటినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడి
  • దేశవ్యాప్తంగానూ జోరుగా టీకా కార్యక్రమం
Telangana Vaccination: తెలంగాణలో 5 కోట్ల మార్క్​ దాటిన కరోనా వ్యాక్సినేషన్​!

Telangana Vaccination: కరోనా వ్యాక్సినేషన్​లో తెలంగాణ రికార్డు సాధిచింది. రాష్ట్రంలో టీకా ప్రక్రియ 5 కోట్ల మార్క్ (Corona vaccination in India) దాటింది. ఈ విషయాన్ని స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు ట్విట్టర్​ ద్వారా (Harish Rao Thanneeru on Corona Vaccination) వెల్లడించారు.

అర్హులందరికి కొవిడ్ వ్యాక్సినేష‌న్ మొద‌టి డోస్ 100 శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా రికార్డు నెలకొల్పిన తెలంగాణ‌.. ఇప్పుడు మ‌రో మైలు రాయిని చేరుకుందని పేర్కొన్నారు హరీశ్​రావు. నేటితో (గురువారం) రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ 5 కోట్లు దాటినట్లు (Telangana Vaccination record) వివరించారు.

డోసుల పంపిణీ ఇలా..

రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,93,76,642 మందికి మొదటి డోసు ప్రక్రియ పూర్తయింది. 2,06,43,107 మంది రెండో డోసువేసుకున్నారు. 1,09,896 మంది ప్రికాషన్ డోసు వేసుకున్నారు.

వారికి అభినందనలు..

రాష్ట్రంలో ఈ రికార్డు సృష్టించేందుకు నిరందరం కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు హరీశ్​ రావు. పంచాయితీ, మన్సిపల్​, ఇతర శాఖల సిబ్బందికి కూడా అభినందనలు తెలిపారు.

అర్హులంతా టీకా వేసుకోవాలి..

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల కరోనా టీకా తీసుకుని.. కుటుంబాలను, సమాజాన్ని సంరక్షించాలని హరీశ్​ రావు పిలుపునచ్చారు.

దేశంలో వ్యాక్సినేషన్ ఇలా..

దేశవ్యాప్తంపగా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా (Corona vaccination in India) కొనసాగుతోంది. కరోనా కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు టీకా ప్రక్రియను వేగవంతం చేశాయి.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,54,61,39,465 డోసులు పంపిణీ చేశారు. ఇక 15-18 ఏళ్ల వయసు వారికి ఈ నెల 3 నుంచి టీకా ప్రక్రియ ప్రారంభమవగా.. పది రోజుల్లోనే 3 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

Also read: Corona in Telangana: తెలంగాణలో కొత్తగా 2,700 మందికి కొవిడ్​- 20 వేల పైకి యాక్టివ్​ కేసులు

Also read: Murder case: తల మాత్రమే దొరికిన హ్యత్య కేసులో పురోగతి- తుర్కయాంజల్​లో మొండెం లభ్యం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News