Telangana Elections : పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించిన నేతలు

                   

Updated: Dec 6, 2018, 02:08 PM IST
Telangana Elections : పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించిన నేతలు

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారం అంతా ఒక లెక్కా.. పోలింగ్ రోజు జరిగే పరిణామాలు ఒక లెక్క. అందుకే ఎన్నికల ప్రచారాన్ని ముగించిన రాజకీయ పార్టీలు...పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చివరి రోజు చివరి నిమిషం కీలకంగా భావిస్తున్న నేతలు గుట్టుచప్పుడు కాకుండా ఇంటింటికి ప్రచారం చేసుకుంటున్నారు..పోల్ మేనేజ్ మెంట్ పై వ్యూహ ప్రతివ్యహాలు వేసుకుంటున్నారు. ప్రధానంగా తటస్థ ఓటర్లను టార్గెట్ చేసుకుంటూ రాజకీయ పార్టీలు ఇంటింటికి ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మద్యం, నగదు ఇలా అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. మరి ఓటరు దేవుళ్లు ఎవరి కరుణిస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది