Congress First List: 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, ఎవరెవరికి చోటు దక్కిందంటే

Congress First List: తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా వామపక్షాలకు 4 సీట్లు కేటాయిస్తోంది పార్టీ.  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2023, 11:45 AM IST
Congress First List: 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, ఎవరెవరికి చోటు దక్కిందంటే

Congress First List: తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ 55 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది.  వామపక్షాల 4 సీట్లు మినహాయిస్తే మిగిలిన 115 స్థానాల్లో 55 మంది పేర్లు ఖరారు చేసింది. 2-3 రోజుల్లో రెండవ తుది జాబితా విడుదల కానుంది. తొలి జాబితాలో ఎవరెవరు స్థానం దక్కించుకున్నారో తెలుసుకుందాం..

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 55 స్థానాల తొలి జాబితాలో కాంగ్రెస్ అగ్ర నేతల పేర్లున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్శింహ, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల పేర్లున్నాయి. ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డిలు ఈసారి అసెంబ్లీకు పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడికి సీటు ఖాయమైంది. అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకు వచ్చిన మైనంపల్లి కుటుంబానికి రెండు సీట్లు కేటాయించింది పార్టీ. 

కాంగ్రెస్ పార్టీ ఈసారి కొన్ని స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించింది. జహీరాబాద్ నుంచి ఆగం చంద్రశేఖర్, సంగారెడ్డి నుంచి తూర్పు జగ్గారెడ్డి, గజ్వేల్ నుంచి టీ నర్శారెడ్డి, మేడ్చల్ నుంచి తోటకూర వజ్రేష్ యాదవ్, మల్కాజ్‌గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, కుత్బుల్లాపూర్ నుంచి హనుమంతరెడ్డి, ఉప్పల్ నుంచి పరమేశ్వర్ రెడ్డి, చేవెళ్ల నుంచి భీం భారత్, పరిగి నుంచి టీ రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ నుంచి గెడ్డం ప్రసాద్ కుమార్, ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మలక్‌పేట్ నుంచి షేక్ అక్బర్, సనత్ నగర్ నుంచి డాక్టర్ కోట నీలిమ, నాంపల్లి నుంచి మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నుంచి ఉస్మాన్ హజారీ, గోషామహల్ నుంచి మొగిలి సునీత, చాంద్రాయణ గుట్ట నుంచి బోగ నగేశ్, యాఖుత్ పురా నుంచి కే రవిరాజు, బహదూర్ పూర్ నుంచి రాజేశ్ కుమార్ పులిపాటి ఉన్నారు. 

కొడంగల్ నుంచి యధావిధిగా రేవంత్ రెడ్డి పోటీలో ఉంటారు. మధిర నుంచి భట్టి విక్రమార్క తన స్థానాన్ని నిలుపుకున్నారు. హజూర్ నగర్ నుంచి నెలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి రెడ్డిలు పోటీ చేస్తున్నారు. నల్గొండ నుంటి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, కొల్హాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు బరిలో ఉన్నారు. నాగార్జున సాగర్ నుంచి ఈసారి జానారెడ్డి కుమారుడు జయవీర్ పోటీ చేస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 55 మంది తొలి జాబితాలో 12 మంది ఎస్సీలు ఉంటే ఇద్దరు ఎస్టీలు ఉన్నారు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పాదయాత్రలు కాకుండా బస్సు యాత్రలు చేయాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర మొదటి మూడ్రోజులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పాల్గొంటారు. కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

Also read: Bathukamma: బతుకమ్మ ఏర్పాట్లపై ఎమ్మెల్యే మాధవరం అసంతృప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News