Telangana Elections 2018: రేపే తెలంగాణ ఎన్నికలు; పోలింగ్ పూర్తి వివరాలు

                   

Updated: Dec 6, 2018, 12:13 PM IST
Telangana Elections 2018: రేపే తెలంగాణ ఎన్నికలు; పోలింగ్ పూర్తి వివరాలు

తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు జరగనున్నాయి..అలాగే 11 న కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1821 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా  2 కోట్ల 80 లక్షల 64 వేల 684 ఓటర్లు ఓటు హక్కు వినియెగించుకోనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా హైదరాబాద్ లో అత్యధికంగా 3,873 ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 4 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 1500 ప్రాంతాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. కాగా 1,60,509 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. 

దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు 
అందరికీ ఓటు హక్కు నినాదంతో ఈ సారి దివ్యాంగుల కూడా ఓటు హక్కు వినియోగించుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ ఛైర్లు సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా ఈవీఎంలను ఏర్పాటు చేశారు

భారీ భద్రతా ఏర్పాట్లు
తెలంగాణ ఎన్నికల నిర్వహణ కోసం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు 30 వేల రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగుతుండగా ..279 కంపెనీల నుంచి  25 వేల మంది కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. దీనికి అదనంగా ఐదు రాష్ట్రాల నుంచి 18 వేల,860 మంది బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి

 సమాచారం కోసం నా ఓటు యూప్ ఏర్పాటు

గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఈ సారి పోలింగ్ బూత్ సమాచారం కోసం 'నా ఓటు' యూప్ ఏర్పాటు చేసింది. పోలింగ్ బూత్ సమాచారం లేకపోవడంతో గత ఎన్నికల్లో పోలింగ్ శాతం కొంత వరకు తగ్గిందని విశ్లేషించిన అధికారులు సాంకేతికతను వినియోగించి ఓటింగ్ శాతం పెంచే అంశంపై దృష్టిసారించారు. ఈ క్రమంలో ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చారు

ముఖ్యాంశాలు: 
* తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు : 119
*  బరిలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య : 1821
*  2 కోట్ల 80 లక్షల 64 వేల 684 ఓటర్లు
*  డిసెంబర్ 7న ఎన్నికలు ..11న ఫలితాలు
* 32 ,815 పోలింగ్ కేంద్రాలు
* ఎన్నికల కోసం 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్
*  పోలింగ్ బూత్ సమాచారం కోసం నా ఓటు యూప్ ఏర్పాటు
* 279 కంపెనీల కేంద్ర బలగాలు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు
* ఐదు రాష్ట్రాల నుంచి 18 వేల,860 మంది బలగాలు
* దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు, వీల్ ఛైర్లు
* బ్రియిలీ లిపిలో ఎపిక్స్ కార్డ్ట్,  సైనోబోర్ట్స్, ర్యాంపులు ఏర్పాటు
* రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 1,60,509 మంది సిబ్బంది