టీ క్యాబినెట్‌కి కొత్త మహిళా మంత్రి..?

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం క్యాబినెట్ మంత్రివర్గంలో ఒక మహిళకు కూడా చోటు కల్పించలేదన్న విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే

Last Updated : Dec 8, 2017, 04:48 PM IST
 టీ క్యాబినెట్‌కి కొత్త మహిళా మంత్రి..?

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం క్యాబినెట్ మంత్రివర్గంలో ఒక మహిళకు కూడా చోటు కల్పించలేదన్న విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

మంత్రివర్గంలోకి ఓ మహిళా ఎమ్మెల్యేను తీసుకోవడానికి యోచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న అజ్మీరా చందూలాల్  తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆయనను కొన్నాళ్లు పదవి నుండి తప్పించి.. ఆ మంత్రి పదవిని అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మికి ఇవ్వనున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.

అలాగే దక్షిణ తెలంగాణలో కూడా పార్టీకి కొంత వ్యతిరేకత వస్తున్న క్రమంలో.. ఆ ప్రాంతం నుండి కూడా ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి

Trending News