Facial Attendance: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల హాజరు ప్రక్రియలో ఇవాళ్టి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇకపై రాష్ట్రంలోని ఉద్యోగులకు ఫేషియల్, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా మారింది. తెలంగాణ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త సంవత్సరంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తెలంగాణ సచివాలయం ఉద్యోగులు, అధికారులు కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఉన్న అటెండెన్స్ విధానం మార్చిన ప్రభుత్వం కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొచ్చింది. జనవరి 1 అంటే ఇవాళ్టి నుంచి కొత్త విధానం ప్రారంభమైంది. సచివాలయంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ఈ విధానం వర్తించనుంది. సచివాలయంలో ప్రతి శాఖ ఎంట్రీ వద్ద ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలు ఏర్పాటయ్యాయి. డిసెంబర్ 12 నే ఇవి ఏర్పాటైనా ఇప్పటి వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఇవాళ్టి నుంచి పేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ నమోదవుతోంది. ఈ విధానం ద్వారా ఉద్యోగులు సమయానికి విధులకు హాజరుకావచ్చు. ఆలస్యంగా వచ్చినా, తొందరగా వెళ్లిపోయినా ఈ విధానం ద్వారా చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది.
విద్యార్ధులు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్
ఇక రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్ల్లో విద్యార్ధులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కూడా ఆధార్ సహిత బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలు, కాలేజీలు, యూనివర్శిటీల్లో ఈ విదానం అనుసరించాలని ఆదేశించింది. విద్యార్ధులకు హాజరు అనేది పై తరగతులకు ప్రొమోట్ చేయడం, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వాటికి ఉపయోగించనున్నారు. వాస్తవానికి బయోమెట్రిక్ గతంలో ఉన్నదే అయినా మధ్యలో కోవిడ్ కారణంగా నిలిపివేశారు.
Also read: DA Announcement: ఉద్యోగులకు సంక్రాంతి కానుక, రెండు డీఏల ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.