హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో కలకత్తాలో చిక్కుకుపోయిన విద్యార్ధుల కోసం మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సుమారు 75 మంది విద్యార్ధుల అభ్యర్థన మేరకు మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ కి తరలిస్తున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో మంత్రి ఈటల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా, పకడ్బందీగా చేస్తుందన్నారు.
Also Read: చికిత్స తీసుకుంటున్న Coronavirus రోగిపై లైంగిక వేధింపులు
మరోవైపు ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. అయితే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన లాక్‌డౌన్ వల్ల చాలా మంది తెలంగాణ వాసులు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారని, ఈక్రమంలో వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు భయబ్రాంతులకు గురికావొద్దని, విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు ఆయన తెలిపారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం..