Group 1 Prelims Final key out: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షను జూన్ 28న నిర్వహించి.. అనంతరం ప్రాథమిక కీను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనిపై జూలై 01 నుంచి 05 వరకు ఆన్ లైన్ లో అభ్యంతరాలను స్వీకరించిన కమిషన్ ఆగస్టు 01న తుది కీను రిలీజ్ చేసింది. ఈసారి గ్రూప్-1 పరీక్షలో 8 ప్రశ్నలను తొలగించారు. 142 ప్రశ్నలే లెక్కలోకి తీసుకుని మార్కులు కేటాయించనున్నారు. మార్కులను మాత్రం 150 మార్కులకే లెక్కిస్తారు.
ఈ సారి గ్రూప్-1 ప్రిలిమ్స్ కు సంబంధించి 2,33,056 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులోకి ఉంచింది. పేపర్ లీకేజీ కారణంగా గతేడాది అక్టోబరు 16న జరగాల్సిన గ్రూప్ 1 ఎగ్జామ్ ను.. ఈ ఏడాది జూన్ 28న నిర్వహించింది టీఎస్పీఎస్సీ. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 994 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మెుత్తం 503 గ్రూప్-1 పోస్టులకుగానూ 3,80,202 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. గత గ్రూప్-1 పరీక్షతో పోలిస్తే ఈసారి 50 వేల మంది తక్కువ రాసినట్లు కమిషన్ పేర్కొంది.
ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీను విడుదల చేసిన కమిషన్.. త్వరలోనే ఫలితాలను వెల్లడించనుంది. అనంతరం మెయిన్స్ కు మూడు నెలల సమయం ఇవ్వనుంది. అక్టోబరు లేదా నవంబరుల్లో గ్రూప్-1 ప్రధాన పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు జోరుగా కొనసాగుతోంది. ఈ కేసులో గత నెలలో మరో 19 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయినవారి సంఖ్య 74కు చేరింది.
Also Read: Harish Rao about Eyes Flu: కళ్ల కలక కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook