COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకంటే ముందు గత 24 గంటల వ్యవధిలో 94,189 మందికి కరోనావైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 2,493 మందికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు. అదే సమయంలో మరో 3,308 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని కొవిడ్ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తెలంగాణలో కరోనా పేషెంట్స్ రికవరీ రేటు 93.70 శాతానికి పెరిగింది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 92.04గా ఉంది.
కొత్తగా నమోదైన కేసులలో యధావిధిగానే జీహెచ్ఎంసీ (GHMC) ఏరియా పరిధిలోనే అధికంగా 318 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 165, రంగారెడ్డి జిల్లాలో 152 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 15 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,296కి పెరిగింది.
Also read : Bank Timings In Telangana: లాక్డౌన్ పొడిగింపు, మారిన బ్యాంకు పనివేళలు, కొత్త టైమింగ్స్ ఇవే
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5,80,844 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 5,44,294 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33,254 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు తగ్గి, రికవరీ రేటు కూడా పెరగడంతో ప్రస్తుతం బెడ్స్ కూడా ఖాళీగానే ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనావైరస్ (COVID-19) నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో కొత్తగా బ్లాక్ ఫంగస్ (Black fungus cases in Telangana), వైట్ ఫంగస్ కేసులు ఏమైనా నమోదవుతున్నాయా అనే కోణంలోనూ తెలంగాణ సర్కారు దృష్టిసారిస్తోంది. అందులో భాగంగానే జిల్లాల్లో వైద్యాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Also read : Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్ ఇవే, లాక్డౌన్ పొడిగింపుతో మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook