Political Heat In Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణలో ఒకపక్క ఎండలు..వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో జాతీయ పార్టీల అగ్రనేతలు పర్యటిస్తుడడంతో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. తెలంగాణలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తుండగా..రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. జాతీయ పార్టీ అగ్రనేతల పర్యటనల్లో భాగంగా పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
తెలంగాణలో రెండు రోజుల పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పర్యటన ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించి పలు పార్టీ కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ వరంగల్ బహిరంగ సభకు చేరుకోనున్నారు. వరంగల్‌లో తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొని..ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకుంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మే 7వ తేదీన ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఆ తర్వాత సంజీవయ్య పార్క్‌లో సంజీవయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళుల్పరించనున్నారు. గాంధీ భవన్‌లో డిజిటల్ మెంబర్ షిప్ ఫోటో సెషన్‌లో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం తెలంగాణ అమరవీరులతో కలిసి భోజనం చేయనున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనతో ఆ పార్టీలో జోష్ వస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ టూర్‌ను సక్సెస్ చేసేందుకు టీ కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్నారు.
తెలంగాణలో ఎలక్షన్‌లకు మరో ఏడాదిన్నర గడువు ఉన్న..ఇప్పటి నుంచి ఎన్నికల జాతర మొదలైంది. ఎన్నికల యుద్ధాన్ని తలపించేలా ప్రాంతీయ, జాతీయ పార్టీలు పోటాపోటీ బహిరంగ సభలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటిగా కృషి చేస్తుండగా..మరోసారి ఎన్నికల్లో గెలుపొంది అధికారం దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. దీంతో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్‌తో రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.
Also Read: National Medical Commission Bill: ఎంబీబీఎస్ విద్యలో రాబోతున్న కీలక మార్పులు..!
Also Read: Yogi Adityanath: సీఎం అయ్యాక మొదటిసారి తన తల్లిని కలుసుకున్న యోగి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.