Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. కొత్తగా వచ్చిన కలెక్టర్లు వీళ్లే..

Telangana IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ల భారీ బదిలీలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు మరోసారి భారీగా జరిగాయి. రేవంత్‌ సర్కార్‌ ఆధ్వర్యంలో 20 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు.

Written by - Renuka Godugu | Last Updated : Jun 15, 2024, 02:17 PM IST
Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. కొత్తగా వచ్చిన కలెక్టర్లు వీళ్లే..

Telangana IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ల భారీ బదిలీలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు మరోసారి భారీగా జరిగాయి. రేవంత్‌ సర్కార్‌ ఆధ్వర్యంలో 20 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ భారీ మార్పులు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలలకే భారీగా కలెక్టర్ల బదిలీల కార్యక్రమం చేపట్టింది.  

ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌ కుమార్‌ ఝా‌, కరీంనగర్‌ అనురాగ్‌ జయంతి, భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్‌ వి పాటిల్‌  నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌, పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష, నాగర్‌ కర్నూల్‌  కలెక్టర్‌గా బదావత్‌ సంతోష్‌ నియమితులయ్యారు. మంచిర్యాల కుమార్‌ దీపక్, భూపాల పల్లి కలెక్టర్‌గా రాహుల్‌ శర్మి, వికారాబాద్‌ కలెక్టర్‌గా ప్రదీప్‌ జైన్‌, సూర్యపేట తేజాస్‌ నందలాల్‌ పవార్, ములుగు కలెక్టర్‌ టీఎస్‌ దివాకరా, నిర్మల్‌ కలెక్టర్‌గా అభిలాష్‌ అభినవ్‌ గా నియమితులయ్యారు.

ఇదీ చదవండి: బిత్తర పోయిన అధికారులు.. కొట్టేందుకు చెయ్యి ఎత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

ఇందులో కొత్త కలెక్టర్లు వీళ్లే..
వనపర్తి జిల్లా కలెక్టర్‌గా ఆదర్శ్‌ సురభి, కామారెడ్డి కలెక్టర్‌గా నియమితులైన  ఆశిశ్‌ సంఘ్‌వాన్, హనుమకొండ ప్రావిణ్య, మంచిర్యాల కుమార్ దీపక్, నల్గొండ నారాయణ రెడ్డి, ములుగు టీఎస్‌ దివాకర, నిర్మల్‌ అభిలాశ్‌, సూర్యపేట తేజస్ నందలాల్‌ పవార్‌, వరంగల్‌ సత్య శారదాదేవి.

ఇదీ చదవండి: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News