తెలంగాణ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ వివరాలు 

Last Updated : Apr 13, 2018, 06:19 PM IST
తెలంగాణ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

ఏప్రిల్ 13న ఉదయం ఇంటర్మీడియెట్ బోర్డు మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి వెల్లడించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్‌ని సైతం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మే 14వ తేదీ నుంచి మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 20 చివరి తేదీలోగా ఫీజు చెల్లించాల్సిందిగా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటన స్పష్టంచేసింది. అయితే, గుడువు తేదీ ముగిసిన తర్వాత ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకునే విధానం గురించి ప్రస్తుతానికి సమాచారం అందుబాటులో లేదు. ఇక ప్రాక్టికల్ పరీక్షల విషయానికొస్తే, మే 24వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి విద్యార్థులు తమ తమ కాలేజీల నుంచి మార్కుల మెమోలు పొందవచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు పేర్కొంది. 

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే మొదటి సంవత్సరం విద్యార్థులు సాధారణ పరీక్ష రుసుం కన్నా మరో రూ.150 అదనంగా చెల్లించాల్సి వుండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజు వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. 

Trending News