TS Inter Exam Date 2021: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 1న తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానుండగా.. మే 2 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు మొదలవుతాయి. ఇంటర్ ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 19 వరకు, ఇంటర్ సెకండియర్ పరీక్షలు మే 2 నుంచి 20 వరకు జరగనున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం నాడు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూలు(TS Inter Exam 2021 Schedule) విడుదల చేశారు.
ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చేశారు. వీటితో పాటు ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే సమయంలో పరీక్షలు(TS Inter Exam Dates 2021) నిర్వహించనున్నారు.
Also Read: New Rules from February 2021: ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నియమాలు, రూల్స్ ఇవే
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్(TS Inter 1st Year Exam Dates 2021)
మే 1 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మే 3 ఇంగ్లీష్ పేపర్-1
మే 5 మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ-1, సివిక్స్-1
మే 7 మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1
మే 10 ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్-1,
మే 12 కెమిస్ట్రీ, సోషియాలజీ, కామర్స్
Also Read: India Post Jobs 2021: తెలంగాణలో Gramin Dak Sevak Postsకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు
తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్(TS Inter 2nd Year Exam Dates 2021)
మే 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
మే 4 ఇంగ్లీష్ పేపర్-2
మే 6 మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ-2, సివిక్స్-2
మే 8 మ్యాథ్స్ పేపర్-2బీ, జువాలజీ-2, హిస్టరీ-2
మే 11 ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్-2
మే 13 కెమిస్ట్రీ పేపర్-2, సోషియాలజీ-2, కామర్స్-2
Also Read: Telangana Govt Jobs: తెలంగాణలో 39 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ, PRC Reportలో ఊహించని వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook