Video: ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అంపైర్‌తో పీవీ సింధు వాగ్వాదం... అసహనానికి లోనైన షట్లర్...

PV Sindhu Argue with Umpire: ఆసియా ఛాంపియన్‌షిప్ సెమీ ఫైనల్లో 'పెనాల్టీ పాయింట్'పై వివాదం చెలరేగింది. పీవీ సింధుకు పెనాల్టీ విధించడంతో... అంపైర్‌తో ఆమె వాగ్వాదానికి దిగింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 12:12 PM IST
  • ఆసియా ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లో అంపైర్‌తో సింధు వాగ్వాదం
  • పెనాల్టీ పాయింట్ విధించిన అంపైర్
  • తన తప్పేమీ లేదని అంపైర్‌తో వాదించిన సిందు
Video: ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అంపైర్‌తో పీవీ సింధు వాగ్వాదం... అసహనానికి లోనైన షట్లర్...

PV Sindhu Argue with Umpire: ఆసియా ఛాంపియన్‌షిప్‌ సెమీ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అంపైర్‌‌తో వాగ్వాదానికి దిగింది. సర్వీస్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందన్న కారణంతో అంపైర్ సింధుకు పెనాల్టీ పాయింట్ విధించాడు. దీంతో అసహనానికి లోనైన సింధు అంపైర్‌తో వాగ్వాదానికి దిగడంతో మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ పెనాల్టీ పాయింటే తన ఓటమికి కారణమని మ్యాచ్ అనంతరం పీవీ సింధు పేర్కొనడం గమనార్హం.

మ్యాచ్ మొదటి సెట్‌ను గెలుచుకున్న సింధు... రెండో సెట్‌లో 14-11తో లీడ్‌లో ఉన్న దశలో అంపైర్ పెనాల్టీ పాయింట్ విధించాడు. యమగూచి అప్పటికీ సిద్ధంగా లేకపోవడం వల్లే తాను సర్వీస్ చేయలేదని సింధు చెప్పినప్పటికీ అంపైర్ వినిపించుకోలేదు. అంపైర్ నిర్ణయాన్ని మ్యాచ్ రిఫరీ కూడా సమర్థించింది. దీంతో సింధు చేసేదేమీ లేకపోయింది. అయితే ఆ తర్వాత సింధు అంతగా రాణించకపోవడంతో రెండో సెట్‌, మూడో సెట్‌లను కోల్పోయి అపజయాన్ని మూటగట్టుకుంది.

మ్యాచ్ అనంతరం సింధు మాట్లాడుతూ... 'సర్వీస్ చేసేందుకు నేను చాలా సమయం తీసుకుంటున్నానని అంపైర్ అన్నారు. కానీ అప్పటికీ యమగూచి సిద్ధంగా లేదు. ఇంతలోనే అంపైర్ సడెన్‌గా పెనాల్టీ పాయింట్ విధించేశారు. నా ఓటమికి అదే కారణమని అనుకుంటున్నా. అప్పటికే నేను 14-11తో లీడ్‌లో ఉన్నాను. కానీ పెనాల్టీ పాయింట్‌తో స్కోర్ 14-12గా మారింది. ఆ తర్వాత యమగూచి వరుస పాయింట్స్‌తో లీడ్‌లోకి వచ్చింది. అంపైర్ వ్యవహరించిన తీరు సరిగా లేదు. ఈ మ్యాచ్ నేను గెలిచి ఫైనల్లో ఆడాల్సింది.' అని పీవీ సింధు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

అంపైర్ పెనాల్టీ విధించాక... ఒకసారి ఫుటేజీ పరిశీలించాల్సిందిగా తాను చీఫ్ రిఫరీని కోరినట్లు సింధు తెలిపింది. కానీ అప్పటికే పెనాల్టీ విధించడంతో చీఫ్ రిఫరీ ఇక అంతేనని చెప్పినట్లు పేర్కొంది. మిస్టెక్ జరిగిందో లేదో తెలుసుకునేందుకు చీఫ్ రిఫరీ ఒకసారి రీప్లే చూసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. సెమీస్‌లో ఓటమితో సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది. 

Also Read: Video: ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అంపైర్‌తో పీవీ సింధు వాగ్వాదం... అసహనానికి లోనైన షట్లర్...   

Also Read: Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News