Malla Reddy Audio Tapes: ఫోన్ సంభాషణ లీక్ వివాదంలో మంత్రి మల్లారెడ్డి.. బుక్ చేసింది టీఆర్ఎస్ నేత!

సీఎం కేసీఆర్, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు నీ గురించి చెబుతానంటూ మంత్రి మల్లారెడ్డిని బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాపోలు రాములు హెచ్చరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Last Updated : Jan 17, 2020, 10:54 AM IST
Malla Reddy Audio Tapes: ఫోన్ సంభాషణ లీక్ వివాదంలో మంత్రి మల్లారెడ్డి.. బుక్ చేసింది టీఆర్ఎస్ నేత!

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్ల కేటాయింపుల వివాదం మరింత ముదురుతోంది. మేడ్చల్ పురపాలిక పరిధిలో టికెట్ల కేటాయింపులో రాష్ట్ర మంత్రి సీహెచ్ మల్లారెడ్డి వ్యవహరించిన తీరుపై స్థానిక నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు నీ గురించి చెబుతానంటూ మంత్రి మల్లారెడ్డిని బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాపోలు రాములు హెచ్చరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తనకు సీటు ఇవ్వాలని, లేక తన వర్గీయులకు అవకాశం ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డికి ఫోన్ చేసి టీఆర్ఎస్ నేత రాములు కోరారు. టికెట్ దక్కకపోవడంతో మంత్రిని నిలదీసేందుకు రాములు ఫోన్‌లో సంభాషించారు.‘నీ మీద నమ్మకం పోయింది. నా వారికి ఎవరికి టికెట్ ఇప్పించావని’ రాములు నిలదీశారు. తొందరపడొద్దంటూ మల్లారెడ్డి నచ్చజెప్పేయత్నం చేసినా రాములు వినిపించుకోలేదు. 

టికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన విషయాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెబుతానని, త్వరలో నేరుగా కలుసుకుని అన్ని విషయాలు చెప్పేస్తాననడం ఆ ఆడియోలో ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల‌కు కూడా ఫిర్యాదు చేస్తానని రాములు హెచ్చరించారు. మేష్ అనే వ్యక్తి ఒక్కసారి కూడా తనను కలవలేదని, నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం ఎలా కుదురుతుందని మల్లారెడ్డి ప్రశ్నించారు. ఆడియో వ్యవహారంపై సైతం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి.. తానేమీ తప్పుగా మాట్లాడలేదని, టికెట్ కోసం ఎవరినీ డబ్బు డిమాండ్ చేయలేదని స్పష్టంచేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News