Vikarabad brs meeting brs follower injured after falling into hot sambar: కొన్నిరోజులుగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. బైటకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం పూటనే మధ్యాహ్నాంలాగా భానుడు భగ భగ మండిపోతున్నాడు. అత్యవసరమైతే తప్ప బైటకు రావోద్దని వైద్యులు చెబుతున్నారు. బైటకు వెళ్లిరాగానే ఎండకు మనిషి పూర్తిగా కమిలిపోతున్నాడు. అంతేకాకుండా.. కాళ్లు,చేతులు ఫుల్ టాన్ గా మారిపోతున్నాయి. కొందరికి శరీరం మంటగాను, తీవ్రమైన తలనొప్పివంటి ఇబ్బందులు కల్గుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎండలో మనం వేడి వస్తువులను పొరపాటు తాకితేనే చర్మం పూర్తిగా కాలిపోయి బైటకు వచ్చేస్తుంటుంది. ఇక నూనె గానీ, మరేదైన ఇలాంటి సమయంలో ఒంటి మీద పడితే ఇంకా నరకమే. అందుకే సమ్మర్ లో వేడి కిచెన్ దగ్గర అందరు జాగ్రత్తగా ఉంటారు. అంతేకాకుండా..వేడి వస్తువులు, గిన్నెల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఇదంతా మనకు తెలిసిందే. అయితే.. ఇలాంటి ఎండలున్న ఈ పరిస్థితుల్లో ఒక వక్తి ఏకంగా సల సల కాగుతున్న పెద్ద సాంబార్ డెగ్సీలో పడిపోయాడు. దీంతో అతగాడికి తీవ్రగాయలైనట్లు సమాచారం.
పూర్తివివరాలు..
ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు ఎన్నికలు కూడా ఈసారి సమ్మర్ హీన్ మరింత పెంచేశాయి. అయితే రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలు, మీటింగ్ లు నిర్వహిస్తుంటారు. తమకు గెలిపించాలని ఉదయం నుంచి రాత్రి వరకు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తుంటారు. ఇక బహిరంగ సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. అలాంటి సమయంలో కార్యకర్తల కోసం భోజనాల ఏర్పాట్లు కూడా నాయకులు చేస్తుంటారు. అయితే.. ఇలాంటి ఒక సమావేశంలో ఒక కార్యకర్త ఏకంగా వెళ్ల సాంబార్ గిన్నెలో పడిపోయాడు.
వికారాబాద్ జిల్లా ధారూర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంపీఎన్నికలలో భాగంగా స్థానిక నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు.. ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో తమ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలింపించుకోవాలని స్పీచులు దంచికొట్టారు. అదే విధంగా, సమావేశం ముగిసిన తర్వాత అక్కడే అందరికి భోజనాలుకూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని కుక్కింద గ్రామానికి చెందిన గోరెంకల మల్లేశం అక్కడ భోజనాల కోసం క్యూలైన్లలో నిలబడ్డాడు. అతగాడు వంటలు చేసే గది పక్కనుంచి లైన్ లో ఉన్నాడు.
Read More: Wedding with Robo: లేడీ రోబోతో యువకుడి ప్రేమాయణం.. మూఢాల్లోనే పెళ్లి.. ఎక్కడో తెలుసా..?
మరీ అక్కడ మట్టే ఉందో.. మరీ కాలుస్లిప్ అయ్యిందో కానీ.. అతను జారీ పోయి సల సలకాగుతున్న సాంబార్ పాత్రలో పడిపోయాడు.అది అత్యంత వేడిగా ఉంది. వెంటనే గట్టిగా అరవడంతో అక్కడున్న వారు వెంటనే బాధితుడిని బైటకు తీశారు. అప్పటికే అతని చర్మం పూర్తిగా కమిలిపోయింది. వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం.. అతడికి అక్కడే చికిత్స నిర్వహిస్తున్నారు. బాధితుడి ఆరోగ్యం మాత్రం ఇప్పుడు నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఒకవైపు మాడు పగలకొడుతున్న ఎండలు, మరోవైపు వ్యక్తి సాంబార్ లో పడి పోవడం చూసి స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమ్మర్ సీజన్ ముగిసే వరకు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే నిపుణులు పలుమార్లు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter