Minister Mahender Reddy: తెలంగాణ ఇసుక పాలసీ దేశంలోనే బెస్ట్.. ఆ 127 పోస్టుల భర్తీకి చర్యలు: మంత్రి మహేందర్ రెడ్డి

Minister Mahender Reddy on Telangana Sand Policy: గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ దృష్టి తీసుకువెళతామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.  గనులు, భూగర్భ వనరుల శాఖను మరింత బలోపేతం చేస్తామన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2023, 06:31 PM IST
Minister Mahender Reddy: తెలంగాణ ఇసుక పాలసీ దేశంలోనే బెస్ట్.. ఆ 127 పోస్టుల భర్తీకి చర్యలు: మంత్రి మహేందర్ రెడ్డి

Minister Mahender Reddy on Telangana Sand Policy: తెలంగాణ  రాష్ట్రంలో అమలు పరుస్తున్న ఇసుక పాలసీ దేశంలోనే బెస్ట్ అని.. ఇతర రాష్ట్రాలు అనుసరించే  విధంగా ఉన్నాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గనులు, భూగర్భ వనరుల శాఖ పై ఉన్నతాధికారులతో శుక్రవారం డా.బీఆర్ ఆంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూగర్భ శాఖ పనితీరు చర్చించారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో అమలులో ఉన్న మైనింగ్ , క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు అంశాలతో పాటు ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం ఎంతవరకు నెరవేరిందని మంత్రి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన ఖనిజ బ్లాక్‌ల వేలంలో భాగంగా వేలం వేయడానికి పొందిన పర్యావరణ అనుమతులతో పాటు స్థాపన, ఆపరేషన్ కొరకు పొందిన అనుమతులను గురించి వాకబు చేసి వీటిని వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 2014 ఆర్ధిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు శాఖ సాధించిన విజయాలు ప్రగతికి తోడ్పాటుగా ఉంటాయని అన్నారు.

గనుల శాఖ దేశంలోనే అద్వితీయ ప్రగతి సాధించడం అభినందనీయమన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 2267 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా..  రూ.3884 కోట్లు ఇప్పటివరకు సమకూరడంపై అభినందిస్తూ మరింత పటిష్టంగా పనిచేసి లక్ష్యాలను సాధించాలని చెప్పారు. గనులు, చిన్న తరహా మైనింగ్ లీజ్‌లపై ఇక నుంచి కూడా మంచి విధానం అమలవుతుందని అన్నారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి  తెస్తామని తెలిపారు. సాంకేతికతను అనుసంధానం చేసి గనులు, భూగర్భ వనరుల శాఖను మరింత బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని వివరించారు.

గనుల నిర్వహణలో పారదర్శకత కోసం ఇసుకను ఆన్‌లైన్ విధానం ద్వారా అమ్మేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయని వాటిని మరింత మెరుగైన విధంగా అమలు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలో అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. టీఎస్ఎండీసీ సంస్థ దేశంలో పలు అవార్డులను తెచ్చుకోవడం అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వ ఇసుక పాలసీ దేశంలోనే బెస్ట్ అని.. రాష్ట్రంలో 101 రీచ్‌ల  ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామన్నారు. 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని వెల్లడించారు. పట్టా  భూముల్లో ఉన్న ఇసుక తదితరాల తవ్వకాలకు  అనుమతులు వేగవంతం చేసేందుకు అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

తెలంగాణ రాష్ట్రం  అన్నీ జిల్లాలలో ఇసుక కొరత లేకుండా లభ్యత   ఉండాలని ఆదేశించారు. టీఎస్ఎండీసీ సాధ్యమైనంత ఎక్కువ ఇసుక రీచులు ఆపరేషన్ లో తేవాలని సూచించారు. ఇసుక రీచ్‌లు అందుబాటులో లేని జిల్లాలపై ఎక్కువ దృష్టిని పెట్టాలని తెలియజేశారు. ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని పెంచాలని సూచించారు.

Also Read: Home Guard Ravinder Death: అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ దిక్కులేదు.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ  

Also Read: Aadhaar Card Update: ఆధార్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మూడు నెలలు గడువు పెంపు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News