Total 84.3 per cent population was administered first dose of Covid vaccine in Telangana: తెలంగాణలో 38.5 శాతం మందికి రెండు డోసుల కరోనా టీకా వేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ టి.హరీశ్‌రావు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 84.3 శాతం (Corona vaccination in Telangana) మందికి మొదటి డోసు పూర్తయినట్లు తెలిపారు. బుధవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే నాటికి ఈ గణాంకాలకు నమోదైనట్లు వెల్లడించారు.
ఇటీవలే ఆరోగ్య శాఖ బాధ్యతలను (ప్రస్తుత శాఖకు అదనంగా) స్వీకరించిన హరీశ్ రావు వైద్య శాఖ ఉన్నతాధికారులతో (Health minister Harish Rao) సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే టీకా గణాంకాలను వెల్లడించారు.
Also read: Sajjanar : ప్రయాణికుడి ట్వీట్‌తో బస్ చార్జీలు తగ్గించిన సజ్జనార్
ఇక దేశవ్యాప్తంగా చూస్తే.. 37.5 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని (Corona vaccination in India).. 79 శాతం మంది ఒక డోసు మాత్రమే తీసుకున్నారని వివరించారు. ఈ లెక్క ప్రకారం వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటుకన్నా.. రాష్ట్ర సగటే ఎక్కువని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీకా ప్రక్రియ వేగంగా ఇంకా పెంచాలని అధికారులకు సూచించారు.
Also read: Covaxin: కొవాగ్జిన్ తీసుకున్న వారికి విదేశీ ప్రయాణాలు ఈజీ- టీకా సామర్థ్యం 77.8 శాతం!
Also read: Kangana Ranaut: 'దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చింది' కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి..
ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తొలిసారి నిర్వహించిన ఈ ఉన్నతస్థాయి సమీక్షలో... కరోనా పరిస్థితుల, వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. వాటి నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు హరీశ్ రావు.
దీనితో పాటు.. కింగ్‌కోఠి ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో 350 పడకలు సాధారణ సేవలకు అందుబాటులోకి రానున్నాయి.
టిమ్స్ సిబ్బంది, ఆస్పత్రి బకాయిల చెల్లింపునకు, టిమ్స్‌లో కొవిడ్ బడ్స్ మినహా.. మిగతా వాటిలో సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
వ్యాక్సినేషన్‌పై రేపు (నవంబర్ 13 శనివారం) అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి హరీశ్‌రావు.
Also read: Drug seizure : హైదరాబాద్‌లో రూ.5.50 కోట్ల డ్రగ్స్ పట్టివేత
Also read: Williams case : నిత్య పెళ్లికొడుకు విలియమ్స్ కేసులో మరో ట్విస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook