Pushpa Villain in Karimnagar: కరీంనగర్‌లో పుష్ప విలన్... ఇమిటేషన్ కాదు... ఏడేళ్లుగా ఇదే గెటప్...

Pushpa Villain in Karimnagar: పుష్ప సినిమాలో విలన్ భన్వర్ సింగ్ శెకావత్‌ను పోలిన ఓ వ్యక్తి కరీంనగర్‌లో దర్శనమిచ్చాడు. ఇప్పుడతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 08:15 PM IST
  • తెలంగాణలో అచ్చు పుష్ప విలన్‌ని పోలిన వ్యక్తి
  • కరీంనగర్‌లో పుష్ప విలన్‌ను తలపిస్తోన్న ట్రాఫిక్ పోలీస్
  • సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Pushpa Villain in Karimnagar: కరీంనగర్‌లో పుష్ప విలన్... ఇమిటేషన్ కాదు... ఏడేళ్లుగా ఇదే గెటప్...

Pushpa Villain in Karimnagar: నున్నటి గుండు.. కళ్లకు నల్ల అద్దాలు... మూతిపై మందంగా పొడవాటి మీసాలు... ఇదీ పుష్ప సినిమాలో విలన్ 'భన్వర్ సింగ్ శెకావత్'గా  ఫాహద్ ఫాజిల్ గెటప్. సినిమా చివరలో ఎంట్రీ ఇచ్చే భన్వర్ సింగ్  శెకావత్ హీరో అల్లు అర్జున్‌కు గట్టి ధమ్కీ ఇస్తాడు. కనిపించింది కాసేపే అయినా ఆ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అచ్చు ఇదే గెటప్‌తో తెలంగాణలోని కరీంనగర్‌లో ఓ వ్యక్తి దర్శనమివ్వడంతో ఇప్పుడతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ వ్యక్తి పేరు శ్రీనివాస్ అలియాస్ బుల్లెట్ శ్రీను. ట్రాఫిక్ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. చూసేందుకు అచ్చు పుష్పలో విలన్ క్యారెక్టర్ భన్వర్ సింగ్ శెకావత్‌ లాగే ఉంటాడు. శెకావత్‌ను సడెన్‌గా చూసినవాళ్లు... అదేంటి పుష్ప విలన్ ఇక్కడున్నాడని పొరబడటం ఖాయం. పుష్ప సినిమా విడుదల తర్వాత బుల్లెట్ శ్రీనుకు కూడా క్రేజ్ వచ్చింది. దారినపోయేవాళ్లు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

నిజానికి బుల్లెట్ శ్రీను ఇదేమీ కావాలనో లేక కొత్తగా ఉంటుందనో ట్రై చేయలేదు. ఏడేళ్లుగా అతను ఇదే గెటప్‌లో ఉంటున్నాడు. అయితే ఇన్నాళ్లు అతన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. గతేడాది డిసెంబర్‌లో 'పుష్ప' విడుదలయ్యాక ఒక్కసారిగా బుల్లెట్ శ్రీనును కాస్త జనం 'భన్వర్ సింగ్ శెకావత్' అని పిలవడం మొదలుపెట్టారు. పుష్ప విలన్ క్యారెక్టర్ కూడా శ్రీనుని పోలి ఉండటంతో జనంలో బుల్లెట్ శ్రీనుకి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడతనితో ఫోటోలు దిగేందుకు జనం ఎగబడుతున్నారు. 

Also Read: Viral News: ఈ దొంగల ముఠా చేసిన పనికి ఇరిగేషన్ అధికారుల దిమ్మతిరిగింది...

Umran Malik: బుల్లెట్‌ బంతి వేసిన సన్‌రైజర్స్‌ బౌలర్.. ఐపీఎల్ 2022లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News