Today Weather Report: రాష్ట్రవ్యాప్తంగా రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయిని పేర్కొంది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో కొనసాగుతుంది. ఇది సగటు సముద్ర మట్టం నుంచి ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతోనే అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం అగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో 9వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం అది ఉత్తర దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు దాదాపు 40 నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Also Read: TSPSC: గుడ్ న్యూస్.. గ్రూప్ -4 అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook