ఓ వైపు భారీ వర్షాల్నించి తేరుకోకముందే హైదరాబాద్ ( Hyderabad ) వాసులకు మరో భయం వెంటాడింది. తాజాగా గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు ( Tremors in Gachibowli ) చోటుచేసుకున్నాయి. భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
మూడ్రోజుల్నించి కురుస్తున్న భారీ వర్షాలు ( Heavy Rains ) హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసేశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అపార్ట్ మెంటు సెల్లార్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. కార్లు వరద ప్రవాహాన్ని కొట్టుకుపోయాయి. భార వర్షాలు, వరద పరిస్థితుల్నించి తేరుకోకముందే హైదరాబాద్ నగర వాసుల్ని మరో భయం వెంటాడింది.
ఇటీవల కొద్దిరోజుల క్రితం నగరంలోని బోరబండలో భారీ శబ్దాలతో ఏర్పడిన ప్రకంపనలు కలకలం రేపాయి. ఇప్పుుడ తాజాగా గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు సంభవించాయి. స్థానిక టీఎన్డీవోఎస్ కాలనీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలతో ఇక్కడి ఇళ్లన్నీ అదిరిపోయాయి. దాంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకొచ్చి పరుగులు తీశారు. తెల్లవారుజామున ఇళ్లలోంచి బయటికొచ్చి చాలాసేపు రోడ్లపై మీదే భయం భయంతో నిలుచున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు డిప్యూటీ కమీషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు ( Richter scale ) పై అతి స్వల్పంగా అంటే 0.8గా నమోదైనట్టు ఎన్ జీ ఆర్ అధికార్లు వెల్లడించారు. ఇది అతి స్వల్పమని భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు భూమిలోకి ఇంకడంతో...భూమి పొరల్లో ఉన్న గాలి బయటకు వస్తున్నప్పుడు ఆ రకంగా శబ్దాలు వస్తున్నాట్టు చెప్పారు. Also read: LRS last date In Telangana: నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ తుది గడువు