హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. సంబరాల్లో సైదిరెడ్డి

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. సంబరాల్లో సైదిరెడ్డి

Updated: Oct 24, 2019, 11:47 AM IST
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. సంబరాల్లో సైదిరెడ్డి

సూర్యాపేట: హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో కారు స్పీడ్ జోరుమీదుంది. ఉదయం 10:20 గంటల వరకు జరిగిన కౌంటింగ్‌లో మొత్తం ఎనిమిది రౌండ్లు పూర్తి కాగా లెక్కించిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 17,400 ఓట్లతో ముందంజలో దూసుకెళ్తున్నారు. టీఆర్ఎస్ ఆధిక్యం కనబరుస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కౌంటింగ్ కేంద్రం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, సైది రెడ్డి నివాసం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
 
మొదటి రౌండ్ నుంచి 8వ రౌండ్ వరకూ టీఆర్ఎస్ అభ్యర్థే ముందంజలో ఉండటంతో అక్కడ ఆ పార్టీకి ప్రధాన పోటీదారుగా భావించిన కాంగ్రెస్ అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా కూడా అంతకంతకూ పెరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు పూర్తిస్థాయి ఫలితం వెల్లడికానుంది.