Parliament Session: పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ... టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం

TRS decides to boycott parliament session: టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ డిమాండును కేంద్రం పట్టించుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 11:06 AM IST
  • పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని టీఆర్ఎస్ ఎంపీల నిర్ణయం
  • యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీతో టీఆర్ఎస్ ఫైట్
  • తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటించే అవకాశం
Parliament Session: పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ... టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం

TRS decides to boycott parliament session: యాసంగి వరి ధాన్యం కొనుగోలు (Paddy Procurement Issue) విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు (TRS MP's Protest) ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎంపీల డిమాండును కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించింది. అదే సమయంలో పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాలని నిర్ణయించింది. వరి ధాన్యం కొనుగోలుతో పాటు 12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పార్లమెంట్ సమావేశాల బహిష్కరణతో (TRS Boycott Parliament Session) టీఆర్ఎస్ ఎంపీల తదుపరి కార్యాచరణ ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. ఎంపీలు హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌తో చర్చలు జరుపుతారా... లేక సీఎం కేసీఆరే (CM KCR) ఢిల్లీ వెళ్లి నిరసనకు దిగుతారా అన్నది చూడాలి. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో నిరసన చేపట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. గతంలో కేసీఆర్ సైతం... అవసరమైతే టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.

పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై (Paddy Procurement) కేంద్రాన్ని నిలదీశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తారా లేదా అనే దానిపై స్పష్టతనివ్వాలని ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీల డిమాండుపై స్పందించిన కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ప్రతీ ఏటా ధాన్యం సేకరణను పెంచుతూనే ఉన్నామని చెప్పారు. టీఆర్ఎస్ ఈ విషయంలో అనవసరంగా రాజకీయం చేస్తోందన్నారు. రబీ సంగతి తర్వాత.. ఖరీఫ్ సీజన్‌లో ఇంకా 29 లక్షల క్వింటాళ్ల ధాన్యం తెలంగాణ నుంచి రావాల్సి ఉందన్నారు. అంతేకాదు, బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ ఇచ్చిందన్నారు.

పీయుష్ గోయల్ సమాధానంపై (Paddy Procurement Issue) అసంతృప్తి వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినప్పటికీ కేంద్రం దిగిరాకపోవడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించి తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.

Also Read: Woman raped by SI: మోసపోయానని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై ఎస్సై అత్యాచారం

 

Trending News