Trs Leaders Fight: పార్టీపై కేసీఆర్ పట్టు తప్పిందా? లీడర్ల బరి తెగింపు అందుకేనా?

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 01:55 PM IST

    టీఆర్ఎస్ పార్టీలో ముదురుతున్న వర్గ పోరు

    కేసీఆర్ ఆదేశాలను పట్టించుకోని గులాబీ లీడర్లు

    పార్టీపై సీఎం కేసీఆర్ కు పట్టు తప్పిందనే టాక్

Trs Leaders Fight: పార్టీపై కేసీఆర్ పట్టు తప్పిందా? లీడర్ల బరి తెగింపు అందుకేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు పార్టీపై పట్టు తప్పుతుందా? పార్టీ నాయకులు ఆయనను పట్టించుకోవడం లేదా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో నిజమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో వరుసుగా వెలుగు చూస్తున్న ఘటనకు ఇందుకు ఉదహరణగా నిలుస్తున్నాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెఢ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి మధ్య తాజాగా వెలుగుచూసిన వివాదం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేకు సపోర్టే చేస్తున్నాడంటూ సీఐని పట్నం బండ బూతులు తిట్టడం వైరల్ గా మారింది. అధికార పార్టీలో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే రౌడీ షీటర్ అన్నట్లుగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాట్లాడటం విపక్షాలకు అస్త్రంగా మారుతోంది.

తాండూరే కాదు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. వర్గాలుగా చీలిపోయిన గులాబీ లీడర్లు ఓపెన్ గానే గొడవలకు దిగుతున్నారు. పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. జల్లాలో రోజూ ఏదో ఒక చోటు టీఆర్ఎస్ నేతల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో వర్గ పోరు తీవ్రంగా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేతల గొడవలు హద్దులు దాటుతున్నాయి. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సే శంకర్ నాయక్ వర్గాలు సై అంటే సై అంటూ కత్తులు దూస్తున్నాయి. ఇటీవల జరిగిన కౌన్సిలర్ హత్య ఘటన టీఆర్ఎస్ లోని రెండు వర్గాల మధ్య రాజేసింది. ఎమ్మెల్యే హస్తం ఉందంటూ సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. 

మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్, మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారన్న ఘటనలో అధికార పార్టీ నేతలే అరెస్ట్ కావడం కలకలం రేపింది. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లోనూ గులాబీ పార్టీ లీడర్ల మధ్య ఆదిపత్య పోరు సాగుతోంది. రంగారెడ్డి జిల్లాలోనూ టీఆర్ఎస్ లో అసమ్మతి పెరిగిపోతుంది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మరో వర్గం దూకుడుగా వెళుతోంది. వర్గ పోరుతో కొందరు నేతలు ఇప్పటికే పార్టీ మారగా.. మరికొందపు ఆదే దారిలో ఉన్నారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ లో కేసీఆర్ సుప్రీం. ఆయన మాటే లీడర్లకు వేదమంటారు. అలాంటి కేసీఆర్ ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా పార్టీ నేతలు రోడ్డెక్కుతుండటం టీఆర్ఎస్ పెద్దలో గుబులు రేపుతోంది. పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ పట్టు తప్పిందా అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జనాల్లో కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం కష్టమని భావించడం వల్లే పార్టీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. అవసరమైతే పార్టీ వీడాలని నిర్ణయానికి నేతలు.. ఇలా బరి తెగిస్తున్నారని అంటున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణమాలతో పార్టీపై కేసీఆర్ కంట్రోల్ కోల్పోతున్నారనే అభిప్రాయమే మెజార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.   

READ ALSO: బ్లేమ్ గేమ్.. మోదీకి కేటీఆర్ కౌంటర్... ఆ పనిచేస్తే రూ.70కే లీటర్ పెట్రోల్ ఇవ్వొచ్చునని సలహా...

   TRS Plenary 2022 KCR Speech: కేసీఆర్‌ థర్డ్ ఫ్రంట్‌ ముగిసినట్లేనా ? ప్లీనరీ ప్రసంగం దేనికి సంకేతం ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News