వార్ వన్ సైడే : టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిన జనాలు

కేసీఆర్ వాగ్దాలను నమ్మిన తెలంగాణ ప్రజలు మళ్లీ ఆయనే ఓటు వేసి గెలిపించారు

Last Updated : Dec 11, 2018, 06:32 PM IST
వార్ వన్ సైడే : టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిన జనాలు

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు మరొక్కసారి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ ఇచ్చి మళ్లీ కేసీఆర్ కే అధికార బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో కారు జోరుకు హస్తం, సైకిల్, కమలం పార్టీలు తట్టుకోలేకపోయాయి. కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా ఈ పార్టీలు లేకోవడం గమనార్హం.

ఇక ఫలితాల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 87 స్థానాలు కైవసం చేసుకోగా మహాకూటమి 22 స్థానాల్లో విజయం సాధించింది. ( కాంగ్రెస్ 20 స్థానాలు, టీడీపీ 2 స్థానాల్లో విజయం  ). ఇదిలా ఉండగా ఓల్డ్ సిటీలో మజ్లీస్ పార్టీ తన ఏడు సిట్టింగ్ స్థానాలను తిరిగి కైసవం చేసుకుంది. ఇక కమలం పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీకి ఒకే ఒక్క స్థానం మాత్రమే దక్కింది. గోషామహల్ నియోజకవర్గ అభ్యర్ధి రాజాసింగ్ మాత్రమే ఆ పార్టీ తరఫున గెలుపొందడం గమనార్హం. కాగా ఇతరులు మూడు స్థానాల్లో గెలుపు సాధించారు. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో 63 స్థానాలకే పరిమితమైన టీఆర్ఎస్ ఈ సారి 87 స్థానాలు సాధించడం గమనార్హం.

Trending News