TRS worker attacks BJP MP Dharmapuri Aravind Hyderabad House: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని అరవింద్ నివాసాన్ని ముట్టడించి.. ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. అంతేకాదు అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీ అరవింద్ ఇంటి ముట్టడికి వెళ్లిన టీఆర్‌ఎస్ కార్యకర్తలను నగర పోలీసులు ఆడుకుని.. అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి వద్ద ఆందోళన చేసిన వారిలో సుమారు 30 మందిని పోలీసులు అరెస్ట్ చేసి.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఎంపీ అరవింద్ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఉన్నారు. దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భారి భద్రతను ఏర్పాటు చేశారు.
కెసిఆర్, KTR, K.కవిత ల ఆదేశాలపై హైదరాబాద్ లోని నా ఇంటిపై దాడి చేసిన TRS గుండాలు.
ఇంట్లో వస్తువులు పగలగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు!
TRS goons attacked my residence and vandalised the house.
They terrorised my mother & created ruckus.@PMOIndia @narendramodi pic.twitter.com/LwtzZU4rfg
— Arvind Dharmapuri (@Arvindharmapuri) November 18, 2022
ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇటీవల ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాడి నేపథ్యంలో అరవింద్ ఇంటికి బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. మరోవైపు ఎంపీ ఇంటి వద్దకు వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వచ్చి దాడికి సంబందించిన విషయాలను తెలుకున్నారు.
Also Read: ఎంపీ అరవింద్.. నిన్ను నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతా: ఎమ్మెల్సీ కవిత
Also Read: Masooda Movie Review : మసూద రివ్యూ.. భయపెట్టిన దెయ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.