TS Inter Result 2023 Date: తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 తేదీపై గందరగోళం

TS Inter Result 2023 Date and Time:తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడిపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు మే8న సోమవారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అవుతాయని కొంతమంది చెబుతుండగా.. మే 9న ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఇంకొంతమంది చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2023, 09:29 PM IST
TS Inter Result 2023 Date: తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 తేదీపై గందరగోళం

TS Inter Result 2023 Date and Time: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడిపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు మే8న సోమవారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అవుతాయని కొంతమంది చెబుతుండగా.. మే 9న ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఇంకొంతమంది చెబుతున్నారు. ఇంటర్మీడియెట్ ఫలితాల తేదీపై తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారిక ప్రకటన చేయకపోవడం వల్లే ఈ గందరగోళం నెలకొంది అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. 

మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగ్గా.. మార్చి 16 నుంచి ఏప్రిల్ 5 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయి. 

రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో ఎప్పుడైనా తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని మాత్రం అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో ఫలితాలు విడుదలైన అనంతరం తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ అయిన tsbie.cgg.gov.in లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 

ఇంటర్ ఫలితాలు ఎలా చెక్ చేయాలంటే..
తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లోకి లాగాన్ అయిన తరువాత హోమ్‌పేజీలో ఉన్న TS Inter 2023 Result అనే లింకుపై క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ చేసి సబ్మిట్ చేయడంతోనే మీ ఫలితాలు దర్శనం ఇస్తాయి. ఫలితాలు ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన మీ ఫలితాలు కాపీని ప్రింటౌట్ తీసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి : Revanth Reddy About ORR Scam: కేసీఆర్, కేటీఆర్ అధికారంలో లేకపోయినా.. నెల నెలా వందల కోట్లు వచ్చే స్కెచ్ వేశారు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడించడంతో పాటు రీవాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్ కి దరఖాస్తు చేసుకునేందుకు తేదీలు ప్రకటించడంతో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువును కూడా ప్రకటించడం జరుగుతుంది. పొరుగు రాష్ట్రమైన ఏపీ ఇంటర్ ఫలితాలు వెల్లడించి ఇప్పటికే వారం రోజులు కావస్తుండగా.. తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై ఇంకా క్లారిటీ కూడా లేకపోవడంతో ఫలితాల వెల్లడి కోసం ఎదురుచూస్తున్న ఇంటర్ స్టూడెంట్స్‌తో పాటు వారి తల్లిదండ్రుల్లో అసహనం పెరిగిపోతోంది.

ఇది కూడా చదవండి : MLA Shankar Naik touching CM KCR feet: టికెట్ కోసం కేసీఆర్ కాళ్లపై పడిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News