Half Day Schools in Telangana: స్కూళ్లకు ఒంటి బడులు.. మార్చి 15వ నుంచి ఏప్రిల్ 24 వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ!

TS Half day Schools Timings: తెలంగాణలో భానుడు ప్రతాపం మొదలైంది. దీంతో ప్రభుత్వం స్కూళ్లకు ఒంటి బడులు ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి అన్ని పాఠశాలలను ఒక పూట నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 06:44 PM IST
Half Day Schools in Telangana: స్కూళ్లకు ఒంటి బడులు.. మార్చి 15వ నుంచి ఏప్రిల్ 24 వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ!

Telangana State Half day School 2023: తెలంగాణలో ఒంటి బడుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఒంటి బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే స్కూళ్లు నడపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మధ్యాహ్నం 12.30 కల్లా విద్యార్థులకు భోజనం కూడా పెట్టేయాలని ఆదేశించింది. పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్‌లు కొనసాగించాలని ఆదేశాల్లో వెల్లడించింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇస్తున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తెలంగాణలో ఎండలు భారీగా దంచికొడుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటల కల్లా స్కూల్స్ బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీరు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ ఆదేశించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 12న స్కూళ్లు తిరిగి ప్రారంభంకానున్నాయి. మొత్తం 48 రోజులపాటు విద్యార్థులకు సమ్మర్ హాలీ డేస్ ఇచ్చింది ప్రభుత్వం.

టెన్త్ క్లాస్ విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3వ తేదీ నుంచి మొదలై 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు 6 పేపర్లతోనే జరగనున్న విషయం తెలిసిందే. గతంలో 11 పేపర్లతో జరిగే పరీక్షలను కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కుదించింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థుల పరీక్షల తేదీలను గతంలో మార్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. 

ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల ఏప్రిల్ 12వ తేదీ నుంచి 17 వరకు.. 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21న ఫలితాలను వెల్లడిస్తారు. ఏప్రిల్ 24వ తేదీన అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించిన.. ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హాలీ డేస్ మొదలవుతాయి.

Also Read: Dogs Attack on Boy: తెలంగాణలో దారుణం.. కుక్కల దాడిలో మరో బాలుడు మృతి

Also Read: Ex Minister Vijaya Rama Rao: మాజీ మంత్రి కన్నుమూత.. టీఆర్ఎస్‌ ఏర్పాటుకు కారణం ఆయనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News