247 Lecturers Jobs: 247 లెక్చరర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు

TSPSC Lecturers Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2022, 12:48 AM IST
  • తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ
  • నోటిఫికేషన్ విడుదల చేసిన టిఎస్పీఎస్సీ
  • ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాల కోసం ఈ వార్తా కథనం చదవండి
247 Lecturers Jobs: 247 లెక్చరర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు

TSPSC Lecturers Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టిఎస్పీఎస్సీ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టులను టిఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం 19 సబ్జెక్టుల్లో లెక్చరర్లను నియమించనుంది. డిసెంబర్ 14వ తేదీ నుంచి జనవరి 4వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్స్ సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 

సబ్జెక్టుల వారీగా చూసుకుంటే.. సివిల్ ఇంజనీరింగ్ లో అత్యధికంగా 82 పోస్టులు ఉండగా ఇందులో మల్టీజోన్ 1 లో 33, మల్టీజోన్ -2 లో 49 వెకెన్సీలు ఉన్నాయి. ఆ తరువాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్ లో అత్యధికంగా 41 వెకెన్సీలు ఉండగా ఆ తరువాతి స్థానంలో మెకానికల్ ఇంజనీరింగ్ లో 36 వెకెన్సీలు ఉన్నాయి.

TSPSC-Jobs-2022-TS-Govt-Jobs-Govt-Jobs-2022.jpg

అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 24 పోస్టులు ఉండగా.. ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో 15 వెకెన్సీలు ఉన్నాయి. కెమిస్ట్రీలో 8 పోస్టులు ఉండగా ఇక మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ ఒక్కో సబ్జెక్టుకు 1 నుంచి 5 లోపే పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫీజు చెల్లింపునకు సైతం చివరి రోజున చివరి నిమిషం వరకు అవకాశం కల్పిస్తున్నట్టు టిఎస్పీఎస్సీ తమ నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది. 

ఇది కూడా చదవండి: MHSRB Jobs Notification 2022: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఇది కూడా చదవండి: TS Eamcet: ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీఎంసెట్ కోచింగ్

ఇది కూడా చదవండి: TSPSC Group 4 Notification: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ 9 వేల గ్రూప్ 4 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News