TSPSC AEE, AMVI Jobs: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టే చెప్పి.. అదే ప్రకటనలో మరో బ్యాడ్ న్యూస్ చెప్పడం నిరుద్యోగుల్లో తీవ్ర చర్చనియాంశమైంది. ఇవాళ సాయంత్రం తెలంగాణలోని వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ల ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించిన టిఎస్పీఎస్సీ.. అదే ప్రకటన చివర్లో మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. రవాణా శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజా ప్రకటన చివర్లో పేర్కొంది. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ నిబంధన విషయంలో చాలా మంది అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిఎస్పీఎస్సీ వివరించింది.
టిఎస్పీఎస్సీ చెప్పిన కారణం నిరుద్యోగులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసినప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి ఆ విషయం తెలియదా లేక ఏమీ తెలియనట్టుగా నిరుద్యోగులను బుజ్జగించడానికి నోటిఫికేషన్ జారీ చేసి.. అభ్యర్థుల నుండి అభ్యంతరాలు రాగానే నోటిఫికేషన్ ఉపసంహరించుకుందామని అనుకున్నారా ? అని నిరుద్యోగులు మండిపడుతున్నారు. చాలా నోటిఫికేషన్ల విషయంలో ప్రకటన విడుదల చేయడం.. ఖాళీలు భర్తీ చేయకుండానే కోర్టు కేసులతో ఆగిపోవడం తెలంగాణలో పరిపాటిగా మారిందని నిరుద్యోగులు (TSPSC AEE Notification) ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.
Also Read : కేసీఆర్ టైగర్ అంటూ బండ్ల కామెంట్స్.. ఆడుకుంటున్న ఎన్టీఆర్ ఫాన్స్
Also Read : Telangana Jobs: రేపటి నుంచే వరుస నోటిఫికేషన్లు! తెలంగాణ నిరుద్యోగులకు పండగే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి