T24: ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టీసీని ప్రభుత్వం లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో దేశంలోనే అత్యంత లాభాలు దక్కించుకున్న ఆర్‌టీసీగా ఏపీఎస్ ఆర్‌టీసీ నిలిచింది. కానీ రెండు దశాబ్దాలుగా ఆర్ టీ సీ తీవ్ర నష్టాలను చవి చూస్తూ వచ్చింది. ఈ మధ్య టికెట్ల రేట్ల పెంపుతో పాటు ఆక్కుపెన్సీ ని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆర్ టీ సీ యాజమాన్యం సఫలం అయింది అనడంలో సందేహం లేదు. గతంతో పోల్చితే నష్టాల శాతం తగ్గింది. అంతే కాకుండా కొన్ని చోట్ల మెల్ల మెల్లగా లాభాల్లోకి మల్లుతున్నట్లుగా ఆర్ టీ సీ అధికారులు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యం లో ప్రయాణికులకు ఆర్ టీ సీ యాజమాన్యం ఆఫర్ ఇస్తూ ప్రయాణికుల సంఖ్య పెంచుతూ వస్తోంది.
పల్లె వెలుగు బస్సు మొదలుకుని సిటీ బస్సులు ఇతర అన్ని రకాల బస్సుల్లో కూడా ఆఫర్లను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త ఆఫర్ ను ప్రకటించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్దులకు మరియు వికలాంగులకు ఆఫర్ ను వర్తింపజేస్తున్నారు. వృద్దులకు 50 శాతం రాయితీతో టికెట్లు ఇవ్వబోతున్నారు. ఇక హైదరాబాద్ మహా నగరం మొత్తం కూడా టీ 24 అనే టికెట్ ను కేవలం రూ.75 లకే కొనుగోలు చేసి ఆగస్టు 15వ తారీకున ప్రయాణించే అవకాశంను కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా పెద్ద ఎత్తున ఆఫర్ లను అమలు చేయబోతున్నట్లుగా ఆర్ టీ సీ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
టీ 24 టికెట్ తో హైదరాబాద్ లోని లోకల్ బస్సుల్లో ఎక్కడి నుండి ఎక్కడికి అయినా ప్రయాణించే అవకాశంను కల్పించడం జరిగింది. అంతే కాకుండా పెద్దలకు రూ.75 కాగా చిన్న పిల్లలకు రూ.50 రూపాయలు మాత్రం వసూళ్లు చేస్తున్నారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి నగరంలో ఎక్కడికి అయినా ఉచితంగా ప్రయాణించేందుకు గాను టీఎస్ ఆర్ టీ సీ అధికారులు అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఆర్ టీ సీ ఇస్తున్న బంపర్ ఆఫర్లతో ఆ రోజు పెద్ద ఎత్తున ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో ఇప్పటికే ఆఫర్లతో గ్రామస్తులను బస్సులు ఎక్కించేదుకు యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ఆఫర్ తో ముందుకు రావడం జరిగింది.
Also Read: College Building Collapsed: భారీవర్షాలకు పేకమేడలా కుప్పకూలిన కాలేజ్ బిల్డింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
T24: టీఎస్ ఆర్‌టీసీ ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 50% రాయితీ