TSRTC Special Offer: ప్రయాణికులకు ఆర్టీసీ బంపరాఫర్.. 33 శాతం ఆదా చేసుకునే ఛాన్స్..

TSRTC Special Offer: ఆర్టీసీ ప్రయాణికులకు ఇది బంపరాఫర్.. కేవలం 20 రోజుల చార్జితో 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 01:10 PM IST
  • ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్
  • నెలవారీ సీజన్ టికెట్‌పై ఆఫర్
  • 20 రోజుల చార్జితో నెల పాటు ప్రయాణం
TSRTC Special Offer: ప్రయాణికులకు ఆర్టీసీ బంపరాఫర్.. 33 శాతం ఆదా చేసుకునే ఛాన్స్..

TSRTC Special Offer: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. నెలవారీ సీజన్ టికెట్ (MST)తో కేవలం 20 రోజులకు చార్జీకే 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. తద్వారా టికెట్ చార్జీలపై ప్రయాణికులకు 33 శాతం ఆదా అవుతుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇది వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా నిత్యం ఒకే మార్గంలో ప్రయాణించేవారికి దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్‌పై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహా శివరాత్రి నేపథ్యంలో రాష్ట్రంలోని పుణ్య క్షేత్రాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తోంది. వేములవాడ, ఏడుపాయల, తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు 30 మంది కలిసి ఒక బృందంగా ఏర్పడితే.. వారి కాలనీకే బస్సు పంపించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ 040-30102829, 040-68153333 సంప్రదించాల్సిందిగా సూచించారు.

వేములవాడ వెళ్లే భక్తులకు ఉచిత బస్సు సదుపాయాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం 14 మినీ బస్సులను నడుపుతున్నట్లు వీసీ సజ్జనార్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించాక పలు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అటు ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే మార్గాలతో పాటు ఇటు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేస్తున్నారు.  

Also Read: Flipkart Smartphone Offer: రూ.17,000 విలువైన Motorola స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.451లకే కొనేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News