Rahul Gandhi vs Kavitha on Twitter : ధాన్యం కొనుగోళ్ల అంశం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంలో తప్పు మీదంటే మీదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఉగాది తర్వాత ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై యుద్ధం తీవ్రతరం చేస్తామంటూ అధికార టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ అంశంపై రైతులకు మద్దతుగా తెలుగులో ట్వీట్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ తమ బాధ్యతలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని అవకాశంగా మల్చుకుంటున్నాయని ఫైరయ్యారు. రెండు పార్టీలు ముందు తమ స్వప్రయోజనాలను వీడి రైతులకు మేలు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఇరు పార్టీలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. పండిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వాలు కొనాల్సిందేనని రాహుల్ స్పష్టంచేశారు.
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.
రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022
తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది.#FightForTelanganaFarmers
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022
అటు రాహుల్ ట్వీట్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ... రాజకీయ లబ్దికోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం చెప్పడంకంటే... పార్లమెంటులో టీఆర్ఎస్ఎంపీల నిరసనకు మద్దతు తెలపాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పంజాబ్, హర్యానాకు ఒకనీతి.. ఇతర రాష్ట్రాలకు మరోనీతి ఉండొద్దని అన్నారు. ఒకేదేశం.. ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయాలని రాహుల్‌కు సూచించారు.
.@RahulGandhi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని @trspartyonline ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి 1/2 https://t.co/BTMd0GwKPe— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022
తమ నిరసన తెలియజేస్తున్నారు..
మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయండి..
ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి.. 2/2#TelanganaWithKCR— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022
మరోవైపు రైతులకు మద్దతుగా రాహుల్ చేసిన ట్వీట్ ను స్వాగతించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. తెలంగాణ రైతుల ఆవేదనను అర్థంచేసుకొని ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది.
రైతు పక్షాన కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. @INCIndia @INCTelangana#CongressForTelangana Farmer's welfare. Under @revanth_anumula ji leadership we will expose #TRSBJP bond. KCR ji & Piyushgoyal ji stop playing with farmers. Start paddy procurement. #FightForTelanganaFarmers https://t.co/u2aylfb4cn
— Revanth Reddy_M (@revanthreddy_67) March 29, 2022
రాహుల్ గాంధీ వైఖరిపై మరోసారి టీఅర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణికం ఠాగూర్ని ఉద్దేశించి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్... వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ కోసం టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని, ఈ విషయంలో రాహుల్ గాంధీ వైఖరి ఏంటో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
Dear @manickamtagore ji, this arrogance reduced your party into double digits in the same parliament. Win or loose, I did not run away from my constituency like your ex CP @RahulGandhi ji did. Also, I did not contest 2 seats like your ex-CP 1/2 https://t.co/RysXVZhIFN
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022
టీఆర్ఎస్ ఇప్పుడు, ఎప్పుడూ రైతుల పక్షమేనని తేల్చిచెప్పిన కవిత.. తెలంగాణలో చివరి గింజ ధాన్యం కొనే వరకు తమ పోరాటం ఆపేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అహంకారపూరిత వైఖరి వల్లే లోక్ సభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య రెండంకెలకు పరిమితం అయిందని ఎద్దేవా చేశారు.
Also read: New EPF Rules: ఏప్రిల్ నుంచి మారనున్న పీఎఫ్ రూల్స్.. పూర్తి వివరాలు ఇవే..
Also read: Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ రేటు ఎంత? ఏ రాష్ట్రంలో అత్యధికం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook