హైదరాబాద్ : చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన ఇద్దరు వ్యక్తులు జైలుపాలయ్యారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్‌సైట్ల కోసం సెర్చ్ చేసే వారిని గుర్తించడం కోసం ఢిల్లీలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్సు ( NCRB )లో స్పెషల్ సెల్ ప్రత్యేకంగా నిఘా పెట్టింది. దేశం నలుమూలలా ఎవరైనా చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోల కోసం వెతికినా.. ఆ వెబ్‌సైట్లను బ్రౌజ్ చేసినా.. వారి ఐపీ అడ్రస్ వివరాలు ( IP addresses ) తమకు తెలిసిపోయేలా ఎన్సీఆర్బీ వ్యవస్థ పనిచేస్తోంది. బాలలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, లైంగిక నేరాలను ( Sexual harassments, Sexual offences ) అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర కృషిచేస్తోన్న భారత ప్రభుత్వం.. అందులో భాగంగానే చైల్డ్ పోర్నోగ్రఫీని నిషేధించడంతో పాటు అటువంటి వీడియోలు వెతికేవారిని, చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసేవారిని కఠినంగా శిక్షిస్తోంది. అంతేకాకుండా చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం అమలులో ఉందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కి చెందిన ఇద్దరు యువకులు చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసి పోలీసులకు దొరికిపోయారు. Also read: COVID-19: 24 గంటల్లో 72 మంది మృతి
కాచిగూడకు చెందిన ఓ యువకుడు ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇతను చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని తిరిగి వాటినే మరిన్ని ఇతర వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేశాడు. మరో ఘటనలో తార్నాకకు చెందిన మరో యువకుడు పోర్న్ వెబ్‌సైట్లలో నుంచి చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసి తిరిగి వాటిని తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసుకున్నాడు. Also read: Color Photo teaser: టీజర్‌కి సూపర్ రెస్పాన్స్
ఈ రెండు ఘటనల్లో ఆయా ఐపీలను ట్రేస్ చేసిన ఎన్‌సీఆర్‌బీ.. వాటి వివరాలను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఐడీ పోలీసులకు పంపించింది. ఎన్సీఆర్బీ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీఐడి పోలీసులు.. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా గురువారం ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. Also read: Plasma therapy: ప్లాస్మాతో ప్రయోజనం లేదా ? ఢిల్లీ ఎయిమ్స్ సంచలన ప్రకటన