BOMBAY High Court: బోంబే హైకోర్టులో వరవరరావుకు ఊరట

BOMBAY High Court: ప్రముఖ విప్లవ కవి, విరసం రచయిత, సామాజిక ఉద్యమకారుడైన వరవరరావుకు బోంబే హైకోర్టులో ఊరట లభించింది. వరవరరావు బెయిల్ గడువు పూర్తవుతునన్న నేపధ్యంలో ఊరట లభించడం విశేషం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2021, 06:35 AM IST
  • మావోయిస్టు సానుభూతిపరుడు వరవరరావుకు ఊరట
  • అక్టోబర్ 28లోగా జైలు అధికారులకు లొంగిపోవల్సిన అవసరం లేదని చెప్పిన బోంబే హైకోర్టు
  • బెయిల్ పొడిగింపుపై అక్టోబర్ 26న విచారణ, బెయిల్ పొడిగించవద్దంటున్న ఎన్ఐఏ
 BOMBAY High Court: బోంబే హైకోర్టులో వరవరరావుకు ఊరట

BOMBAY High Court: ప్రముఖ విప్లవ కవి, విరసం రచయిత, సామాజిక ఉద్యమకారుడైన వరవరరావుకు బోంబే హైకోర్టులో ఊరట లభించింది. వరవరరావు బెయిల్ గడువు పూర్తవుతునన్న నేపధ్యంలో ఊరట లభించడం విశేషం.

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, విరసం రచయిత వరవరరావు బెయిల్(Varavararao Bail) గడువు ముగిసింది. సెప్టెంబర్ 5లోగా జైలు అధికారుల ఎదుట వరవరరావు లొంగిపోవల్సిన ఉంది. అయితే బెయిల్ పొడిగించాలంటూ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై బోంబే హైకోర్టు విచారణ చేపట్టింది. అక్టోబర్ 28లోగా లొంగిపోవల్సిన అవసరం లేదంటూ ఊరటనిచ్చింది. బెయిల్ పొడిగింపుపై దాఖలైన పిటీషన్‌పై అక్టోబర్ 26వ తేదీన విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు ఫిబ్రవరి 22వ తేదీన ఆరు నెలల మధ్యంతర బెయిల్ మంజూరైంది. అప్పట్నించి ఆయన ముంబైలో ఓ అద్దె ఇంట్లో భార్యతో కలిసి ఉంటున్నారు. అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ గడువు పొడిగించాలని వరవరరావు విజ్ఞప్తి చేసుకున్నారు. మరోవైపు బెయిల్‌పై ఉన్న సమయంలో హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి కోరారు. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)మాత్రం వరవరరావుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బోంబో హైకోర్టులో(Bombay High Court)అఫిడవిట్ కూడా దాఖలు చేరింది.

నక్సలైట్లతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు వరవరరావు కీలకపాత్ర పోషించారు. నక్సలైట్ సానుభూతిపరుడిగా ఈయనకు పేరుంది. ప్రస్తుతం అనారోగ్యంతో మరణించి మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే(Maoist RK)చర్చలకు నేతృత్వం వహించిన సమయంలో వరవరరావు(Varavararao) కూడా చర్చల్లో ఉన్నారు. ప్రస్తుతం ఎల్గార్ పరిషత్ - మావోయిస్టు సంబంధాల కేసులో నిందితుడిగా ఉన్నారు. 

Also read: Breaking: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News