Dharmapuri News: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరదలు పోటెత్తడంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. దీంతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నంలో భాగంగా వుయ్ హెల్ప్ యూ అనే స్వచ్ఛంద సంస్థ వారికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది.
ధర్మపురిలో గోదావరి వరదలతో నష్టపోయిన వారిలో సుమారు 400 కుటుంబాలకు వుయ్ హెల్ప్ యూ స్వచ్చంద సంస్థ పలువురు దాతలు సహకారంతో సుమారు 4 లక్షల విలువైన 400 చాపలు, 1100 దుప్పట్లను అందచేశారు. స్థానిక బ్రాహ్మణ సంఘం భవనం వేదికగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, వార్డు కౌన్సిలర్స్ అయ్యోరి వేణుగోపాల్, సంగనభట్ల సంతోషి దినేష్, పురాణపు కిరణ్మయి సాంబమూర్తి, గరిగె అరుణ రమేష్, విద్యావేత్త సంగనభట్ల రామకిష్టయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇందారపు రామకృష్ణ, ఎల్‌ఐసీ మేనేజర్ ఇందారపు రామకిషన్, వై టీం సభ్యులు మధ్వాచారి చిరంజీవి, గుండి వినయ్, పెండ్యాల సంజీవ్, పెండ్యాల శ్రీకంఠ శర్మ, మధు నటరాజ్, కొరిడే అభిరామ్, జైసకిరణ్ సుముఖ్, రామక్క రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈ సేవా కార్యక్రమానికి కృషి చేసిన వై సభ్యులను అతిథులు అభినందించారు.
Also Read : TRS MLA COMMENTS:కేసీఆర్ పిలుపు మేరకు దేశానికి స్వాతంత్ర్యం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విడ్డూరం
Also Read : Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్ ఫైర్.. ఫ్రీడమ్ ర్యాలీలో కలకలం.. రాజీనామా చేస్తారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook