Nia Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర లింకులపై ఆరా

NIA RAIDS: తెలంగాణలో ఆదివారం జరిగిన ఎన్ఐఏ దాడులు తీవ్ర కలకలం రేపాయి. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఎన్‌ఐఏ బృందాలు తెలంగాణాలోని 38 ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో చోట సోదాలు నిర్వహించాయి. ఎన్ఐఏతో పాటు జీఎస్టీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాదశిక్షణ ఇస్తూ దేశవ్యాప్తంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. నిజామాబాద్‌లోనే 23 చోట్ల, జగిత్యాలలో 7, హైదరాబాద్‌లో 4, నిర్మల్‌లో 2, ఆదిలాబాద్‌, కరీంనగర్‌లలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో 8.31లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ ప్రకటించింది.

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 04:08 PM IST

Video ThumbnailPlay icon

Trending News