Revanth Reddy: లోక్సభ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. పంద్రాగస్టు 15వ తేదీ వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ దీనికోసం రైతుల రుణాల వివరాలు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీపై కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రుణమాఫీ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చేయకపోవడంపై తీవ్ర రాజకీయ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ కాంగ్రెస్కు ఓటేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేస్తోంది.