Ambedkar name to TS secretariat: తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు

Dr BR Ambedkar name to TS secretariat: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని నిర్ణయించారు.

  • Zee Media Bureau
  • Sep 16, 2022, 12:22 AM IST

Dr BR Ambedkar name to TS secretariat: తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన సెక్రటేరియేట్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక కూడా అంబేడ్కర్‌ దార్శనికత దాగి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. కొత్త పార్లమెంట్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరామని, దీనిపై త్వరలో ప్రధాని మోదీకి లేఖ రాస్తానని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News