Pakistan Train Accident: న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్ రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పి పక్కకు దూసుకెళ్లిన ఘటనలో 15 మంది మరణించగా మరో 50 మంది వరకు పాకిస్థాన్ మీడియా కథనాలు స్పష్టంచేశాయి. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది అని తెలుస్తోంది. కరాచీకి 275 కిలోమీటర్ల దూరంలోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ రైలు ప్రమాదం జరిగింది. 10 బోగీలు రైలు నుంచి విడిపోయి మరో ట్రాక్‌పైకి వెళ్లిపోయాయని రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్ సుక్కుర్ మహమూదుర్ రెహమాన్ జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఈ ఘైర రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన నవాబ్‌షాలోని పీపుల్స్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. పట్టాలు తప్పి ప్రమాదానికి గురైన బోగీల నుంచి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు నిరంతర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్ సుక్కుర్ మహమూదుర్ రెహమాన్ తెలిపారు. లోకో షెడ్ రోహ్రి నుండి ఒక రైలు సంఘటన స్థలానికి బయల్దేరిందని రెహమాన్ చెప్పారు. రైలు ప్రమాదాని గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
పాకిస్థాన్ మీడియా కథనాలను పరిశీలిస్తే.. ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా.. మరోవైపు ప్రమాదం జరిగిన చోట దెబ్బ తిన్న రైలు కంపార్ట్‌మెంట్లను రైల్వే బృందాలు తిరిగి పునరుద్ధరించే పనిలో నిమగ్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. మూడేళ్ల జైలు శిక్ష
ఈ రైలు ప్రమాదం కారణంగా రైళ్లను నిలిపివేయడంతో కరాచి నుంచి ఆ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. లాహోర్‌లో పాకిస్థాన్ రైల్వే, పౌర విమానయాన శాఖ మంత్రి ఖ్వాజా సాద్ రఫీఖ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం 15 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది అని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి : Mexico Bus Accident: మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి