Imran Khan Arrested: తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ.. మూడేళ్ల జైలు శిక్ష విధించింది ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు. అంతేకాకుండా ఐదేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్‌పై కోర్టు రూ.100,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పీటీఐ చీఫ్ పాక్ ప్రధానిగా పనిచేసిన సమయంలో తనకు లభించిన బహుమతులను విక్రయించిన కేసులో దోషిగా తేల్చింది.కోర్టు ఆదేశాల తర్వాత కొద్దిసేపటికే ఆయనను లాహోర్‌లో భారీ భద్రతా దళాల మధ్య అరెస్టు చేసి కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించారు.
తోషాఖానా అనేది క్యాబినెట్ డివిజన్ కింద ఉన్న ఒక విభాగం. ఇది పాలకులు, ప్రభుత్వ అధికారులకు ఇతర ప్రభుత్వాల అధిపతులు, విదేశీ ప్రముఖులు ఇచ్చే గిఫ్ట్‌లను నిల్వ చేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో తోషాఖానాలో వచ్చిన బహుమతుల సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ మే 10న పాకిస్థాన్ ఎన్నికల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల విచారణలో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమాయున్ దిలావర్ మాజీ ప్రధానిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించారు. తాజాగా శనివారం జైలు శిక్ష విధిస్తూ తీర్పును కోర్టు వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది.
కోర్డు తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడయ్యారు. దీంతో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ నెల 9న జాతీయ అసెంబ్లీని ఆ దేశ ప్రధాని షెహబాజ్ రద్దు చేయనుండగా.. మరో 90 రోజుల్లో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌పై వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోటీ చేయనున్నారు.
గతంలో ఈ కేసులోనే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని అరెస్టుకు నిరసనగా పాకిస్థాన్‌లో చాలా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ముఖ్యమైన సైనిక స్థావరాలపై కూడా దాడులు జరిగాయి. మరుసటి రోజు ఇమ్రాన్ ఖాన్ బెయిల్‌పై విడుదల అయ్యారు. హింస ఘటనకు పాల్పడిన వేలాది మంది పీటీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: How To Control Someone: ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలి..? ఈ చాణక్య వ్యూహాలు పాటించండి
Also Read: Chandramukhi 2: అప్పుడే చంద్రముఖి-2 రిలీజ్.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. మూడేళ్ల జైలు శిక్ష