Dubai fire: దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి.. మృతుల్లో నలుగురు భారతీయులు..

Dubai fire: దుబాయ్‌లోని ఓ ఐదు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృత్యువాత పడగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురు ఇండియన్స్ కూడా ఉన్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2023, 12:22 PM IST
Dubai fire: దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి.. మృతుల్లో నలుగురు భారతీయులు..

Fire accident in Dubai: దుబాయ్‌ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్ భవనంలో మంటలు చెలరేగి 16 మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం అల్ రాస్‌ నగరంలోని అల్ ఖలీజ్ స్ట్రీట్‌లో గల ఐదు అంతస్తుల భవనంలో సంభవించింది. నాలుగో అంతస్తులో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం మధ్యాహ్నాం 12.35 గంటలకు మంటలు ఎగసిపడగా.. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు ఎంతో శ్రమించి మధ్యాహ్నాం 2.42 గంటలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 

మృతుల్లో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో కేరళకు చెందిన దంపతులు, తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. రిజేష్ (38), అతని భార్య జిషి (32) మలప్పురం వెంగరకు చెందిన వారు కాగా.. అబ్దుల్ ఖాదర్ మరియు సలియాకుండ్ తమిళనాడు వాసులు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారు కుటుంబ సభ్యులకు భారతీయ సామాజిక కార్యకర్త నసీర్ వాటనపల్లి అండగా నిలిస్తున్నారు. 

Also Read: Texas dairy explosion: డెయిరీ ఫాంలో భారీ పేలుడు.. 18,000 ఆవుల మృతి!

సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘటనకు దారి తీసిందని అధికారులు ప్రాథమింగా నిర్ధారించారు. ఎలా జరిగందనే విషయాన్ని తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నారు. అల్ రాస్ నగరం ఓల్ సౌక్ జిల్లాలో క్రీక్ నది ఒడ్డున ఉంది. దుబాయ్ లో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల్లో ఇది ఒకటి. వేలాది మంది వ్యాపారులకు, కార్మికులకు నిలయం ఈ సిటీ.

Also Read: Migrant boat capsize: వలసదారుల పడవ బోల్తా.. 25 మంది మృత్యువాత, 15 మంది మిస్సింగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News