మరోసారి విరుచుకుపడిన సునామి.. 62 మంది మృతి!

మరోసారి విరుచుకుపడిన సునామి.. 62 మంది మృతి!

Last Updated : Dec 23, 2018, 11:55 AM IST
మరోసారి విరుచుకుపడిన సునామి.. 62 మంది మృతి!

జకర్తా: ఇండోనేషియాపై మరోసారి సునామి తన ప్రతాపం చూపించింది. శనివారం రాత్రి 9.30 గంటల తర్వాత దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని దీవులు, తీరప్రాంతాలపై సునామి విరుచుకుపడింది. సునామి విరుచురుపడటంతో తీర ప్రాంతాలు మునకకు గురై 62 మంది మృతిచెందారు. తొలుత 43 మంది మృత్యువాతపడినట్టు ప్రాథమిక సమాచారం అందినప్పటికీ ఆ తర్వాత మృతుల సంఖ్య 62కి చేరినట్టు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. సునామి ధాటికి 600 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని సహాయకార్యక్రమాల్లో పాల్గొంటున్న అధికార యంత్రాంగం పేర్కొంది. ఇండోనేషియాలోని అనక్ క్రకటోవా అగ్ని పర్వతం బద్దలైన కారణంగానే ఈ సునామి సంభవించినట్టు సమాచారం. 1883లోనూ బద్ధలైన ఈ అగ్ని పర్వతం అప్పట్లో 36000 మందిని పొట్టనపెట్టుకున్నట్టు ఇండోనేషియా అధికారవర్గాలు వెల్లడించాయి.

Trending News