Afghan Blast Update: తాలిబాన్ల పాలనలో కూడా ఆఫ్ఘనిస్తాన్ లో నరమేధం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట బాంబులు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మళ్లీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాంబు పేలుళ్లు మూడు ప్రదేశాల్లో సంభవించాయి. ఈ ఘటనలో 25 మంది స్కూల్ విద్యార్ధులు మృతి చెందారు. అయితే ఈ దారుణ బాంబు పేలుళ్లలో ఐసిస్ ఉగ్రముఠాల హస్తమున్నట్టు పలు దేశాల అధికారులు అభిప్రాయ పడుతున్నారు. తాలిబాన్లతో విభేదిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు తాలిబాన్లను అస్థిర పరిచేందుకు ఆఫ్ఘాన్ లో బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రాజ్యధికారంలోకి వచ్చాన తరువాత ఐసిస్ దాడులు పెచ్చరిల్లి పోయాయి. షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు ఐసిస్ ఉగ్రవాదులు. తాజాగా ముంతాజ్ ఎడ్యుకేషన్ సెంటర్ , అబ్దుల్‌రహీం స్కూళ్ల దగ్గర పేలుళ్లు జరిగాయి.
ఈ ఘోరమైన దాడి కాబూల్‌లోని దష్త్ ఎ బర్చిలో సంభవించింది. అబ్దుర్ రహీమ్ షాహిద్ హైస్కూల్‌పై ఆత్మాహుతి బాంబర్లు విరుచుకుపడ్డారు. ఈ దాడి జరిగినప్పుడు విద్యార్థులు అంతా తరగతి లోపలే ఉన్నారు. ఈ దాడిపై అంతర్గత వ్యవహారాల శాఖ స్పందించింది. దాడి జరిగిన వెంటనే సహాయక చర్యలతో పాటు దర్యాప్తు కూడా ప్రారంభించామని వెల్లడించింది. త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. షియాలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను తప్పికొడతామని ధీమా వ్యక్తం చేసింది. బాంబు పేలుళ్ల తర్వాత జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించింది. షియాల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో విద్యార్థులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని కాబూల్ పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉందని చెప్పారు. ఆస్థి, ప్రాణ నష్టం పై ఇప్పుడే వివరాలు వెల్లడించలేమని అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ల ఏలుబడిలోకి వచ్చిన తర్వాత ఐసిస్ ఉగ్రవాదులు ఆఫ్గన్ ను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. షియా జనాభాను ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబు దాడులకు తెగబడుతున్నారు. ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టించేందుకు తాలిబన్లు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్‌లో ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్’ పేరుతో యాక్టివ్ అయిన ఐసిస్ ఉగ్రవాదులు ఎక్కడో ఒక చోట దాడులకు తెగబడుతూ తన అస్థిత్వాన్ని చాటుకుంటున్నారు.
Also Read: Chahal-Dhanashree: సీన్ రివర్స్.. చహల్‌ను ఇంటర్వ్యూ చేసిన ధనశ్రీ! ఫన్నీ ప్రశ్నలతో ఆటాడుకుందిగా
Also Read: Palakkad: అక్కడ కొత్త రూల్.. బైక్‌పై ఇద్దరు పురుషులు ప్రయాణించరాదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Afghan Blast Update: ఆఫ్ఘనిస్తాన్ పై ఐసిస్ దాడి..25 మంది స్కూల్ విద్యార్ధులు మృతి
ఆఫ్ఘనిస్తాన్ పై విరుచుకుపడుతున్న ఐసిస్
25 మంది స్కూల్ విద్యార్ధులు మృతి
తాలిబాన్లతో విభేదిస్తున్న ఐసిస్