ఆఫ్ఘనిస్తాన్‌లో "సేవ్ ది చిల్డ్రన్" ఆఫీసుపై దాడి

ప్రపంచ ప్రఖ్యాత అనాథ బాలల సేవా సంస్థ "సేవ్ ది చిల్డ్రన్" కార్యాలయంపై ఆఫ్ఘనిస్తాన్‌లో దుండగులు తెగబడ్డారు.

Last Updated : Jan 25, 2018, 12:28 PM IST
ఆఫ్ఘనిస్తాన్‌లో "సేవ్ ది చిల్డ్రన్" ఆఫీసుపై దాడి

ప్రపంచ ప్రఖ్యాత అనాథ బాలల సేవా సంస్థ "సేవ్ ది చిల్డ్రన్" కార్యాలయంపై ఆఫ్ఘనిస్తాన్‌లో దుండగులు తెగబడ్డారు. బుధవారం జలాలాబాద్‌లోని ఈ ఆఫీసును ముట్టడించిన ఐసిస్ ఉగ్రవాదులు ముగ్గురు స్టాఫ్ మెంబర్లను హతమార్చారు. మరో నలుగురు ఇదే ఐసిస్ ఉగ్రవాదుల చేతులో గాయాలబారిన పడ్డారు. 1976 నుండే "సేవ్ ది చిల్డ్రన్" తన కార్యకలాపాలను ఆఫ్ఘనిస్తాన్‌లో సాగించడం విశేషం. అనేక వేలమంది ఆఫ్ఘన్ అనాథ బాలలకు సేవ చేసిన ఈ సంస్థపై దాడి చేసినందుకు ఇప్పటికే ప్రపంచ దేశాధినేతలందరూ ఆ ఘటనను ఖండించారు. ఈ ఘటన జరిగాక, ఆఫ్ఘనిస్తాన్‌ నుండి బ్రిటన్ మరియు స్వీడిష్ సంస్థలను వెల్లగొట్టేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ దాడి అని ఐసిస్ ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో ఈ దేశంలో "సేవ్ ది చిల్డ్రన్" ఆపరేషన్స్‌ను ప్రస్తుతానికి బంద్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటన జరగక ముందే, ఆ సంస్థ ఆఫీసు బయట ఉన్న కారును బాంబుతో పేల్చేసిన ఉగ్రవాదులు ఆ తర్వాత ఆఫీసులోకి కూడా జొరబడ్డారు. 

Trending News