Panjshir vs Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు ఎదురుదెబ్బ, 6 వందలమంది హతం ?

Panjshir vs Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పుడా దేశంలో ఆధిపత్యపోరు నెలకొంది. ఆఫ్ఘన్ ప్రతిఘటన దళాలు, తాలిబన్లకు మధ్య అంతర్యుద్ధం ఆందోళన కల్గిస్తోంది. 6 వందలమంది వరకూ తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ దళం ప్రకటించుకుంది..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2021, 10:51 AM IST
  • ఆఫ్ఘనిస్తాన్‌లో మారుతున్న పరిణామాలు, పంజ్‌షీర్ దళాలు, తాలిబన్లకు మధ్య అంతర్యుద్ధం
  • పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై ఆధిపత్యం కోసం తాలిబన్ల పోరాటం
  • 6 వందలమంది తాలిబన్లను హతమార్చినట్టు ప్రకటించిన పంజ్‌షీర్ దళాలు
Panjshir vs Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు ఎదురుదెబ్బ, 6 వందలమంది హతం ?

Panjshir vs Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పుడా దేశంలో ఆధిపత్యపోరు నెలకొంది. ఆఫ్ఘన్ ప్రతిఘటన దళాలు, తాలిబన్లకు మధ్య అంతర్యుద్ధం ఆందోళన కల్గిస్తోంది. 6 వందలమంది వరకూ తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ దళం ప్రకటించుకుంది..

తాలిబన్లకు ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan)నిత్యం ఆటంకాలు ఎదురవుతున్నాయి. దేశాన్ని ఆక్రమించుకున్నా సరే కీలకమైన పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం చాలా ఇబ్బంది పెడుతోంది. పంజ్‌షీర్ దళం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. దేశంలో అతి ముఖ్యమైన ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామన్న తాలిబన్ల ప్రకటనను పంజ్‌షీర్ దళం కొట్టిపారేస్తోంది. అంతేకాకుండా ఏకంగా 6 వందలమంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు ఆ దళం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో దేశంలో గందరగోళం ఏర్పడింది.

దేశం మొత్తం ఆక్రమించినా పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై(Panjshir Province) మాత్రం తాలిబన్లు పైచేయి సాధించలేకపోతున్నారు. 6 వందలమంది తాలిబన్లు హతమయ్యారని(6 Hundred Talibans shot dead)..వేయిమందికి పైగా లొంగిపోయారని పంజ్‌షీర్ దళం చేస్తున్న ప్రకటనల్లో ఎంతవరకూ నిజముందో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందనే విషయంపై అంతర్జాతీయ మీడియాలో చర్చ నడుస్తోంది. పంజ్‌షీర్ దళాల ప్రకటనను తాలిబన్లు ధృవీకరించడం లేదు. యుద్ధం కొనసాగుతోందని మాత్రం స్పష్టం చేశారు. పంజ్‌షీర్‌కు వెళ్లేమార్గంలో ప్రతిఘటన దళాలు ల్యాండ్‌మైన్స్ అమర్చారని..అయినా ఈ ప్రావిన్స్‌లోని 7 జిల్లాల్లో నాలుగు తాలిబన్ల ఆధీనంలో వచ్చాయనేది తాలిబన్ల వాదన. మధ్య ప్రావిన్స్ వైపు నుంచి తాలిబన్ల పోరాటం కొనసాగుతోందని తెలుస్తోంది. మరోవైపు కాబూల్ ఎయిర్ పోర్ట్‌ను(Kabul Airport) తిరిగి ప్రారంబించిన తాలిబన్లు(Talibans)..ఇతర దేశాల ప్రతినిధులు, రవాణా, సహాయక చర్యల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

Also read: India on Afghan Issue: భారత ఆందోళనలపై తాలిబన్ల సానుకూల స్పందన ఎంతవరకు నిజం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News