Corona Study: కరోనా వైరస్ రాకూడదంటే..కిటికీలు తెర్చుకోవల్సిందే

కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి ఏం చేయాలి..ఒక్కో సందర్బంలో ఒక్కో వాదన. వాదన సంగతి ఎలా ఉన్నా రూమర్లు మాత్రం ఊరికే ఊపందుకుంటున్నాయి. మరి నిజమేంటి..ఏం చేయాలి..

Last Updated : Aug 25, 2020, 08:54 PM IST
Corona Study: కరోనా వైరస్ రాకూడదంటే..కిటికీలు తెర్చుకోవల్సిందే

కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి ఏం చేయాలి..ఒక్కో సందర్బంలో ఒక్కో వాదన. వాదన సంగతి ఎలా ఉన్నా రూమర్లు మాత్రం ఊరికే ఊపందుకుంటున్నాయి. మరి నిజమేంటి..ఏం చేయాలి..

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని ఎప్పుడైతే నిర్ధారితమైందో..చాలామంది తలుపులు, కిటికీలు మూసుకుని ఉంచుకుంటున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరైనా కరోనా రోగులు తుమ్మినా, దగ్గినా ఆ వైరస్ గాలి ద్వారా తమ ఇళ్లలోకి చొరబడుతుందనేది వారి నమ్మకం. ఇప్పుడీ నమ్మకాన్ని తప్పంటున్నారు శాస్త్రవేత్తలు. బాహ్య వాతావరణంలో  కరోనా వైరస్ కొన్ని గంటల పాటు గాలిలో ( Corona virus through air ) జీవిస్తుందని..అది అక్కడుండేవారిపై దాడి చేస్తుందని జూలై లో చాలా మంది నిపుణులు ధృవీకరించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World health organisation ) కూడా ధృవీకరించింది. 

అంతవరకూ నిజమే. కానీ గాలిలో వైరస్ సోకుతుందనే కారణంతో ఇంట్లో తలుపులు, కిటికీలు మూసి వేసి ఉంచుకుంటే ప్రమాదం మరింత పెరుగుతుందనేది కొత్తవాదన. వెంటిలేషన్ సౌకర్యం సరిగ్గా లేని రెస్టారెంట్లు, పబ్బులు, మందిరాల్లో కరోనా కేసులు ( Corona cases ) ఎక్కువగా విస్తరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ దాడి నుంచి తప్పించుకోవాలంటే...ఇంట్లో గాలిపోయే మార్గాల్ని  అంటే తలుపులను, కిటికీలకను వీలైనంతమేరకు తెరిచి ఉంచుకోవాలని చెబుతున్నారు. కొత్త భవనాల్ని గాలి వెలుతురు ధారాళంగా ప్రవహించేలా నిర్మించుకోవాలంటున్నారు. చైనాలోని ( China ) గ్వాంగ్ జౌ నగరంలో కిటికీలు లేని ఐదో అంతస్తు రెస్టారెంట్ లో లంచ్ చేసిన పదిమందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాలంటే మాస్క్ లు, శానిటైజర్లు ఎంత అవసరమో...ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచుకోవడం కూడా ఇకపై అంతే అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. Also read: Usain Bolt: సూపర్ ఫాస్ట్ రన్నర్ బోల్డ్ కు కరోనా పాజిటివ్

Trending News