America Revenge: ఆఫ్ఘన్‌లోని ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా వైమానిక దాడులు

America Revenge: కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రదాడి ఘటనపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ప్రతీకారంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థపై వైమానిక దాడులు నిర్వహించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2021, 11:04 AM IST
America Revenge: ఆఫ్ఘన్‌లోని ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా వైమానిక దాడులు

America Revenge: కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రదాడి ఘటనపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ప్రతీకారంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థపై వైమానిక దాడులు నిర్వహించింది. 

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంలో జరిగిన జంటపేలుళ్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేపింది. ఈ ఘటనలో అమెరికన్ సైనికులు సహా 100 మందిపైగా మరణించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తీవ్రంగా స్పందించారు. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన గంటల వ్యవధిలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఆఫ్ఘన్‌లోని ఐసిస్ ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. 

ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)లోని నంగహార్ ప్రావిన్స్‌లోని ఐసిసి ఖోరసాన్ ఉగ్రవాదుల కదలికల్ని అమెరికా దళాలు గుర్తించాయి.వైమానిక దాడులతో(Airstrikes) విరుచుకుపడ్డాయి.ఆఫ్ఘన్ భూభాగం అవతలి నుంచే రీపర్ ద్రోన్ సహాయంతో దాడులు జరిగాయి. కాబూల్ పేలుళ్లు సూత్రధారి వాహనంలో వెళ్తుండగా గుర్తించి..పక్కా సమాచారంతో దాడి నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో కాబూల్ ఆత్మాహుతి దాడుల వ్యూహకర్తతో పాటు అతని సహాయకుడు మరణించాడు. సాధారణ పౌరులెవ్వరికీ ఏం కాలేదని అమెరికన్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కాబూల్ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ బలగాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని అమెరికా తెలిపింది. మరోవైపు కాబూల్ ఎయిర్‌పోర్ట్(Kabul Airport)వెలుపల సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన బాంబు పేలుళ్లు ఘటనలో వందమందికి పైగా మరణించారు. ఇందులో 13 మంది అమెరికన్ సైనికులున్నారు. ఐసీస్ కే (ISIS) ఉగ్రవాద సంస్థపై అమెరికాతో పాటు తాలిబన్లు కూడా ప్రతీకార చర్యలకు దిగారు. కాబూల్‌లో ఇంటింటినీ గాలిస్తున్న తాలిబన్(Talibans)బలగాలు, ఐసిస్ కే సానుభూతిపరులు, మద్దతుదారుల్ని అదుపులో తీసుకున్నారు. 

Also read: Afghanistan Issue: 5 లక్షలకు చేరనున్న ఆప్ఘన్ శరణార్ధుల సంఖ్య, రానున్నవి చీకటి రోజులే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News