Omicron New Variant: అమెరికాను తీవ్రంగా వణికిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమైందే

Omicron New Variant: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అగ్రరాజ్యం అమెరికాను వణకిస్తోంది. ఇప్పటివరకూ వెలుగుచూసిన అన్ని వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరమైంది. అందుకే ఆందోళన కల్గిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2023, 04:32 PM IST
Omicron New Variant: అమెరికాను తీవ్రంగా వణికిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమైందే

అమెరికాను ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5 తీవ్రంగా భయపెడుతోంది. డెల్టా వేరియంట్ కంటే 5 రెట్లు ప్రమాదకరమైన ఈ కరోనా వైరస్‌ను సూపర్ వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.

చైనా సహా ప్రపంచదేశాల్ని కరోనా వైరస్ మరోసారి వణికిస్తోంది. అయితే చైనాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 తీవ్రంగా ప్రతాపం చూపిస్తుంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఒమిక్రాన్‌కు చెందిన మరో సబ్ వేరియంట్  XBB.1.5 గజగజలాడిస్తోంది. న్యూయార్క్ ఆసుపత్రుల్లో అత్యధికులు ఈ వేరియంట్‌తో బాధపడుతున్నవారే కావడం గమనార్హం. అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో 40 శాతం కేసులు ఈ వేరియంట్‌వే.

ఇప్పటి వరకూ వచ్చిన అన్ని వేరియంట్ల కంటే ఇది అత్యంత ప్రమాదకరమైంది. డెల్టా వేరియంట్ కంటే 5 రెట్లు డేంజరస్. ఇతర సబ్ వేరియంట్లతో పోలిస్తే 120 రెట్లు వేగంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. అందుకే దీనిని సూపర్ వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఏ విధమైన వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ప్రభావం చూపించడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తోంది. 

అమెరికాలో కేవలం వారం రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్ కేసులు రెట్టింపయ్యాయి. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అందించిన వివరాల ప్రకారం ఈ వేరియంట్ సింగపూర్ నుంచి అమెరికాకు వ్యాపించింది. అసలు  XBB.1.5 వేరియంట్‌ను గుర్తించడం కూడా అంతల సులభం కాదని తెలుస్తోంది. ఎందుకంటే దగ్గు, జలుబు వంటి ప్రాధమిక లక్షణాలు కన్పించవు. మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. 2022 ఆగస్టులోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్‌ను గుర్తించింది. 

ప్రపంచవ్యాప్తంగా అమెరికా కాకుండా చైనా, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్  దేశాల్లో ఈ వేరియంట్ ఉంది. ఇటీవలే గుజరాత్‌లో తొలి కేసు గుర్తించారు. 

Also read: New Year 2023: నూతన సంవత్సరం 2023 ముందుగా మొదలైంది ఈ దేశంలోనే.. ఒకేసారి 43 దేశాల్లో న్యూ ఇయర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News